Fake News, Telugu
 

‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీం లేదు

0

‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ స్కీం ద్వారా 5 నుండి 16 సంవత్సరాల విద్యార్థులు వివిధ ఆర్ధిక ప్రయోజనాలు పొందవొచ్చని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 5 నుండి 16 సంవత్సరాల విద్యార్థులకు ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ స్కీం ద్వారా వివిధ ఆర్ధిక ప్రయోజనాలు.

ఫాక్ట్ (నిజం): ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీం లేదు. ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్ట్ లో ఇచ్చిన స్కీం పేరుతో వెతకగా, అటువంటి పేరుతో స్కీం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్సైటులలో ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. ఆ స్కీం గురించి వార్తాపత్రికల్లో కూడా ఎక్కడా రాలేదు. ఒకవేళ అలాంటి ప్రభుత్వ స్కీం ఉంటే, దాన్ని మొదలుపెట్టినప్పుడు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. ఆ స్కీం పేరు మీద రెండు వెబ్సైటులు (https://pmsvy-cloud.in/Home/Index మరియు http://www.pmsvy.com/index.aspx) ఉన్నట్టు సెర్చ్ రిజల్ట్స్ ద్వార తెలుస్తుంది. ఆ రెండు వెబ్సైటుల్లో ఉన్న ఫోన్ నెంబర్లకి FACTLY కాల్ చేయగా, ఎటువంటి సమాధానం లేదు. ఆ వెబ్సైటుల గురించి మరింత సమాచారం కోసం కింద చూడవొచ్చు

అంతేకాదు, ఆ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం లేదని, వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా ట్వీట్ చేసారు.

ఇదే విధంగా ఇంతకముందు ప్రభుత్వ పథకాల మీద వచ్చిన ఎన్నో ఫేక్ న్యూస్ లను FACTLY తప్పని చెప్తూ ఆర్టికల్స్ రాసింది. వాటిని ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వం స్కీం లేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll