భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉన్న ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి, అది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోకిన కొరోనావైరస్ తీవ్రతను తగ్గించడానికి గ్లోబ్ పై ‘గో’ మూత్రం పోస్తున్న ఫోటో అని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రపంచ వ్యాప్తంగా సోకిన కొరోనావైరస్ తీవ్రతను తగ్గించడానికి రామ్‌నాథ్ కోవింద్ గ్లోబ్ పై ‘గో’ మూత్రం పోస్తున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో 5 జనవరి 2017 న బీహార్ లో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించినది. కొరోనావైరస్ కి, ఆ ఫోటోకి అసలు సంబంధం లేదు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు.
పోస్టులోని ఫోటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో ‘Paramarth Niketan’ అనే ఫేస్బుక్ పేజీ జనవరి 2017న పెట్టిన పోస్టు లో లభించింది. ‘GIWA బీహార్ సమావేశం: సర్వ ధర్మ స్వచ్ఛతా సద్భావన సంకల్ప్’ కార్యక్రమం లో ఈ ఫోటో తీసినట్టు అందులో పెట్టిన ఆల్బమ్ ద్వారా తెలుస్తుంది. ‘www.sadhviji.org’ అనే వెబ్సైటు లో, 5 జనవరి 2017న బీహార్ లో జరిగిన ‘GIWA బీహార్ సమావేశం: సర్వ ధర్మ స్వచ్ఛతా సద్భావన సంకల్ప్’ కార్యక్రమం లో అప్పటి బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నాడని తెలుపుతూ పెట్టిన పోస్ట్ లభించింది. GIWA అనేది ఒక ఆర్గనైజేషన్ అనీ, మెరుగైన నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత ప్రతి మానవునికి అందుబాటులో ఉండే ప్రపంచాన్ని సృష్టించడంలో సహాయపడటం దాని లక్ష్యం అని దాని వెబ్సైటు ద్వారా తెలిసింది. గ్లోబ్ పై నీళ్ళను పోసే కార్యక్రమాన్ని ‘వాటర్ బ్లెస్సింగ్ సెరిమోనీ’ అంటారు.
చివరగా, 2017 ఫోటో ని పెట్టి, ‘ప్రపంచ వ్యాప్తంగా సోకిన కొరోనావైరస్ తీవ్రతను తగ్గించడానికి గ్లోబ్ పై ‘గో’ మూత్రం పోస్తున్న ఫోటో’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?