Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2016లో మసీదును సందర్శించినప్పటిది

1

ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, ‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దేశాన్ని ప్రస్తుత సంక్షోభం నుండి రక్షించాలని కోరుకుంటూ మసీదును సందర్శించాడు’ అని చెప్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రస్తుత సంక్షోభం నుండి దేశాన్ని రక్షించాలని కోరుకుంటూ మసీదును సందర్శించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో 2016 లో జిన్‌పింగ్ తన ‘నింగ్షియా హుయ్’ అనే స్వయం ప్రతిపత్తి గల ప్రాంత పర్యటనలో భాగంగా ఒక మసీదును సందర్శించినప్పటిది. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

చైనాలో నోవెల్ కొరోనా వైరస్ ని డిసెంబర్ 2019 చివరి వారంలో గుర్తించారు. ఇప్పటివరకు ఆ వైరస్ 28,000 మందికి పైగా సోకింది మరియు సుమారు 550 మందికి పైగా చనిపోయారు. దాంతో, ప్రస్తుతం చైనా దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది.

యూట్యూబ్ లో ‘Xi Jinping visits Mosque’ అని వెతికినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ లో పోస్టులోని వీడియో లభించింది. ఆ వీడియో కి టైంస్టంప్– ‘20 జులై 2016’ అని ఉంది. దాని కింద ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా, 2016 లో ‘నింగ్షియా హుయ్’ అనే స్వయం ప్రతిపత్తి గల ప్రాంత పర్యటనలో పర్యటనలో భాగంగా ‘క్సేన్ చెంగ్’ మసీదును జిన్‌పింగ్ సందర్శించినప్పటి వీడియో అని తెలిసింది. .

చివరిగా, పాత వీడియోని పెట్టి, ‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దేశాన్ని ప్రస్తుత సంక్షోభం నుండి రక్షించాలని కోరుకుంటూ మసీదును సందర్శించాడు’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll