Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పాత వీడియో క్లిప్స్ పెట్టి, ‘చైనాలో కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల వింత చేష్టలు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

‘చైనాలో కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల వింత చేష్టలు’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనాలో కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల వింత చేష్టలు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియోలోని వ్యక్తులకు కొరోనా వైరస్ సోకలేదు. అవి పాత క్లిప్స్. వాటికీ కొరోనా వైరస్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన వీడియోలో చాలా వీడియో క్లిప్స్ ని కలిపి పెట్టారు. కావున, ఒక్కొక్క వీడియో క్లిప్ ని పరిశీలిద్దాం.

వీడియో క్లిప్ 1:

ఈ వీడియో క్లిప్ కనీసం జూలై 2018 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.  

వీడియో క్లిప్ 2:

ఈ వీడియో క్లిప్ కనీసం మార్చ్ 2018 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.

వీడియో క్లిప్ 3:

ఈ వీడియో క్లిప్ కనీసం ఏప్రిల్ 2017 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.

వీడియో క్లిప్ 4:

ఈ వీడియో క్లిప్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని సెప్టెంబర్ 2017 లో ప్రచురించిన ఆర్టికల్ లో చూడవొచ్చు.

వీడియో క్లిప్ 5:

ఈ వీడియో క్లిప్ కనీసం ఏప్రిల్ 2017 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.

వీడియో క్లిప్ 6:

ఈ వీడియో క్లిప్ కనీసం డిసెంబర్ 2017 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.

వీడియో క్లిప్ 7:

ఈ వీడియో క్లిప్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని జూలై 2018 లో ప్రచురించిన ఆర్టికల్ లో చూడవొచ్చు.

వీడియో క్లిప్ 8:

ఈ వీడియో క్లిప్ కనీసం సెప్టెంబర్ 2016 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.

వీడియో క్లిప్ 9:

ఈ వీడియో క్లిప్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని జూన్ 2018 లో ప్రచురించిన ఆర్టికల్ లో చూడవొచ్చు.

నోవెల్ కొరోనా వైరస్ ని డిసెంబర్ 2019 చివరి వారంలో గుర్తించారు. కానీ, వీడియోలోని చాలా వరకు క్లిప్స్ ఎప్పటినుండో ఇంటర్నెట్ లో ఉన్నట్టు చూడవొచ్చు. కావున, వాటికీ కొరోనా వైరస్ కి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, పాత వీడియో క్లిప్స్ పెట్టి, ‘చైనాలో కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల వింత చేష్టలు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll