Fake News, Telugu
 

హాస్పిటల్ లో నిద్రిస్తున్న రోగి పై అనుకోకుండా ఒక పావురం కూర్చున్న పాత దృశ్యాన్ని తప్పుడు సారాంశంతో షేర్ చేస్తున్నారు

0

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఒక రోగిని పావురం పరామర్శిస్తున్న దృశ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. హాస్పిటల్ లో చేరిన ఆ వ్యక్తి కోసం అతని బంధువులు ఎవరూ రాలేదని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. స్ట్రెచర్ పై పడుకొని ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఆ పావురానికి తిండి పెట్టేవాడని, ఆ అనుభందంతోనే పావురం క్రమం తప్పకుండా అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్ కు వచ్చేదని ఈ పోస్టులో తెలిపారు.  అంతేకాదు, ఈ ఫోటోని ఆ హాస్పిటల్ లోని ఒక నర్స్ తీసినట్టు ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రోగిని ఒక పావురం పరామర్శిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని గ్రీస్ దేశంలోని ఒక హాస్పిటల్ లో తీసారు. ఈ ఫోటోని లోనిస్ ప్రోటోనోటారియోస్ అనే వ్యక్తి 19 అక్టోబర్ 2013 నాడు తీసినట్టు తెలిసింది. ప్రోటోనోటారియోస్ తండ్రి, ఫోటోలో నిద్రిస్తూ కనిపిస్తున్న వ్యక్తి ఒకే హాస్పిటల్ వార్డ్ రూమ్ లో ఉన్నప్పుడు అతను ఈ ఫోటో తీసాడు. హాస్పిటల్ లో చేరిన ఆ వ్యక్తి కోసం అతని బంధువులు ఎవరూ రాలేదని, ఆ పావురానికి రోజు అతను తిండి పెట్టేవాడని  చెప్పాడనికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Flickr ఇమేజ్ షేరింగ్ వెబ్సైటులో లభించింది. ఈ ఫోటోని లోనిస్ ప్రోటోనోటారియోస్ అనే యూసర్ 19 అక్టోబర్ 2013 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని గ్రీస్ దేశం ఏథెన్స్ నగరంలోని ఒక హాస్పిటల్ లో తీసినట్టు వివరణలో తెలిపారు.

ఈ ఫోటోకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ‘The Quint’ న్యూస్ సంస్థ లోనిస్ ప్రోటోనోటారియోస్ ని సంప్రదించారు. ప్రోటోనోటారియోస్ ‘The Quint’  న్యూస్ సంస్థతో మాట్లాడుతూ, ఈ ఫోటోని  19 అక్టోబర్ 2013 నాడు ఏథెన్స్ నగరంలోని రెడ్ క్రాస్ హాస్పిటల్ లో తీసినట్టు చెప్పారు. ఫోటోలో నిద్రిస్తూ కనిపిస్తున్న వ్యక్తి, తన తండ్రి ఒకే హాస్పిటల్ వార్డులో చికిత్స పొందినట్టు  ప్రోటోనోటారియోస్ తెలిపారు. చికిత్స పొందుతున్న తన తండ్రి దగ్గర అతను కూర్చున్నప్పుడు, ఒక పావురం పక్కన పడుకొని ఉన్న పేషెంట్ పై వాలినట్టు ప్రోటోనోటారియోస్ తెలిపారు. ఈ దృశ్యాన్ని తాను ఫోటో తీసి ‘Flickr’ వెబ్సైటులో షేర్ చేసినట్టు ప్రోటోనోటారియోస్ స్పష్టం చేసారు. తన తండ్రి వేరే వార్డుకి షిఫ్ట్ అవ్వడంతో, మళ్ళీ ఆ పేషెంట్ ని గాని, ఆ పావురాన్ని గాని చూడలేదని ప్రోటోనోటారియోస్ ‘The Quint’ న్యూస్ సంస్థ కు తెలిపారు. ఈ ఫోటోకి సంబంధించి ప్రోటోనోటారియోస్ ఇచ్చిన స్పష్టతని రిపోర్ట్ చేస్తూ ‘The Quint’ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

ఈ ఫోటోకి సంబంధించిన మరికొన్ని వివరాలని లోనిస్ ప్రోటోనోటారియోస్ ‘Lead Stories’ న్యూస్ సంస్థకి కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వివరాలని రిపోర్ట్ చేస్తూ ‘Lead Stories’ న్యూస్ సంస్థ 27 జనవరి 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులోని సారాంశం తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హాస్పిటల్ లో నిద్రిస్తున్న రోగి పై అనుకోకుండా ఒక పావురం కూర్చున్న పాత దృశ్యాన్ని తప్పుడు సారాంశంతో ఇప్పుడు షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll