Fake News, Telugu
 

పాత ఫోటోని పెట్టి కరోనా సమయంలో ఆకాశంలో వెలసిన వినాయకుడు అని షేర్ చేస్తున్నారు

0

ఆకాశంలో మేఘాలు వినాయకుడి రూపంలో ఉన్న ఫోటోని చూపిస్తూ భూలోకంలో పండగలు జరుపుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి వస్తున్న నేపథ్యంలో వినాయకుడు ఆకాశంలో వెలిసాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఇటీవల కాలంలో వినాయక చవితి జరుపుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి వస్తున్న కారణంగా వినాయకుడు ఆకాశంలో వెలిసాడు.

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న ఫోటోని 2015లో ప్రముఖ నటుడు రిషి కపూర్ తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్ట్ చేసాడు. దీన్నిబట్టి ఈ ఫోటో పాతదని చెప్పొచు. తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు గణేష్ ఉత్సవాల నిర్వహణలకు సంబంధించి కఠిన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చిన నేపధ్యంలో ఈ ఫోటోని వివిధ క్లెయిమ్స్ తో బాగా షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 29 సెప్టెంబర్ 2015న ప్రముఖ నటుడు రిషి కపూర్ తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్ట్ చేసాడని తెలిసింది. తిరుపతిలో ఆకాశంలోని మేఘాలు వినాయకుడి రూపంలో దర్శనమిచ్చాయి అన్న వివరణతో ఈ ఫోటోని షేర్ చేసాడు. ఐతే ఈ ఫోటో నిజంగానే తిరుపతిలో తీసిందని కచ్చితంగా చెప్పడానికి మాకు ఎటువంటి ఆధారాలు దొరకనప్పటికి, రిషి కపూర్ ఈ ఫోటోని షేర్ చేసిన తేదీ బట్టి ఈ ఫోటో ఇటీవలే జరిగిన వినాయక చవితి సమయంలో తీసింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కఠిన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చిన నేపధ్యంలో ఈ ఫోటోని వివిధ క్లెయిమ్స్ తో బాగా షేర్ చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలకు సంబంధించి పలు రాష్ట్రాలు విధించిన నిబంధనల గురించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పాత ఫోటోని చూపిస్తూ, పండగలు జరుపుకోవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి వస్తున్న నేపథ్యంలో వినాయకుడు ఆకాశంలో వెలిసాడు అని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll