Fake News, Telugu
 

NDTV చీఫ్ ప్రణయ్ రాయ్ అసలు పేరు పర్వేజ్ రాజా అని, జన్మస్థలం కరాచీ అని సీబీఐ దాడులలో పత్రాలు దొరకలేదు

0

NDTV చీఫ్ ప్రణయ్ రాయ్ పై సీబీఐ జరిపిన దాడులలో తన అసలు పేరు పర్వేజ్ రాజా అని, జన్మస్థలం కరాచీ అని పత్రాలు దొరికినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : సీబీఐ దాడులలో NDTV చీఫ్ ప్రణయ్ రాయ్ అసలు పేరు పర్వేజ్ రాజా అని, జన్మస్థలం కరాచీ అని పత్రాలు దొరికాయి.       

ఫాక్ట్ (నిజం): ప్రణయ్ రాయ్ అసలు పేరు పర్వేజ్ రాజా అని, జన్మస్థలం కరాచీ అని పత్రాలు దొరికినట్టు సీబీఐ ఎక్కడా కూడా చెప్పినట్టు సమాచారం లేదు. ప్రణయ్ రాయ్ ఇంటి పై చేసిన తనిఖీల మీద సీబీఐ ఇచ్చిన వివరణ లో కూడా పోస్ట్ లో చెప్పిన విషయాలు లేవు. అంతే కాదు, 2017 లో ప్రణయ్ రాయ్ పై సీబీఐ దాడుల తర్వాత ఇలాంటి పోస్టులే వైరల్ అయినప్పుడు, అవి తప్పని కొన్ని వెబ్ సైట్లు ఆర్టికల్స్ కూడా రాసాయి. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, సీబీఐ దాడుల్లో అలాంటి పత్రాలు దొరికినట్టు ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. అంతేకాదు, ప్రణయ్ రాయ్ ఇంటి పై చేసిన తనిఖీల మీద సీబీఐ ఇచ్చిన వివరణ లో కూడా పోస్ట్ లో చెప్పిన విషయాలు లేవు.

ప్రణయ్ రాయ్ పై సీబీఐ దాడులు జరిగిన తర్వాత 2017 లో కూడా ఇలాంటి వార్తలే సోషల్ మీడియా లో చాలా వైరల్ అయ్యాయి. ప్రణయ్ రాయ్ పై వస్తున్న ఫేక్ న్యూస్ లపై ‘DailyO’ వెబ్ సైట్ ఒక ఆర్టికల్ కూడా రాసింది. ఆ ఆర్టికల్ లో చెప్పిన ఫేక్ న్యూస్ లల్లో ఒకటి పోస్ట్ లో చెప్పిన విషయం. అంతేకాదు, ఇలాంటి ఫేక్ వార్తలపై 2017 లోనే వివిధ సంస్థలు రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, NDTV చీఫ్ ప్రణయ్ రాయ్ అసలు పేరు పర్వేజ్ రాజా అని, జన్మస్థలం కరాచీ అని సీబీఐ దాడులలో పత్రాలు దొరికలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll