Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని హరీష్ రావు విలేకరులు ప్రశ్నలకు భయపడి పారిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

విలేకరులు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు సమాధానం ఇవ్వలేక పారిపోతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర అప్పులకు, నెల వారీగా కడుతున్న వడ్డీలకు సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు హరీష్ రావు సమాధానం ఇవ్వలేక పారిపోయినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్ర అప్పులు, కడుతున్న వడ్డీలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి హరీష్ రావు సమాధానం ఇవ్వలేక పారిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు 23 ఆగష్టు 2021 నాడు ఇచ్చిన ప్రెస్ మీట్ వీడియోలోని వేర్వేరు క్లిప్పులని జత చేస్తూ ఈ వీడియోని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం అప్పులు, నెల వారీగా కడుతున్న వడ్డీలకు సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు హరీష్ రావు, ప్రతి సంవత్సరం అసెంబ్లీ నివేదికలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుపుతున్నామని, ఆ సమాచారం పబ్లిక్ డొమైన్ వెబ్సైటులో అందుబాటులో ఉందని సమాధానమిచ్చారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన సమాచారం కోసం గుగూల్‌లో వెతికితే, ఈ వీడియోలో కనిపిస్తున్నవి తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు 23 ఆగష్టు 2021 నాడు ఇచ్చిన ప్రెస్ మీట్లోని దృశ్యాలని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం అప్పులు, నెల వారీగా కడుతున్న వడ్డీలకు సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు హరీష్ రావు, “ప్రతి సంవత్సరం అసెంబ్లీ నివేదికలో రాష్ట్ర అప్పులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుపుతున్నాం. ఆ సమాచారం పబ్లిక్ డొమైన్లో కూడా అందుబాటులో ఉంది”, అని సమాధానమిచ్చారు. హరీష్ రావు ప్రెస్ మీట్‌కు సంబంధించి ‘V6’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన వీడియోలోని 1:28:25 నిమిషాల దగ్గర ఆ దృశ్యాలని మనం చూడవచ్చు.

ఈ ప్రెస్ మీట్లో హరీష్ రావు విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే, హరీష్ రావు తన ప్రెస్ మీట్ ముగించే సమయంలో ఒక విలేకరి కేంద్రానికి కట్టే పన్నులో రాష్ట్ర వాటాకు సంబంధించి ప్రశ్న అడిగారు. ఇప్పటికే ప్రెస్ మీట్ సమయం ఆలస్యమయ్యిందని తెలుపుతూ హరీష్ రావు ఆ ప్రశ్నకు సమాధానమివ్వకుండానే ప్రెస్ మీట్ ముగించారు. ఆ దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ  చూడవచ్చు. దీన్ని బట్టి, హరీష్ రావు ప్రెస్ మీట్లోని వేర్వేరు క్లిప్పులని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించినట్టు స్పష్టమయ్యింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని చూపిస్తూ హరీష్ రావు విలేకరులు ప్రశ్నలకు భయపడి పారిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll