Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోను అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత కోతుల సమూహం అనందపడినట్లు షేర్ చేస్తున్నారు.

0

22 జనవరి 2024న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన నేపథ్యంలో రామ రాజ్యం వచ్చిందని నోరులేని వానరసైన్యం (కోతుల గుంపు) సంతోషపడుతుంది అని చెప్తున్న పోస్టు ఒకటి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి మద్దతుగా కోతుల గుంపు గంటను అదే పనిగా కొడుతున్న వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం

క్లెయిమ్: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగాక రామ రాజ్యం వచ్చిందని వానరసైన్యం (కోతుల గుంపు) సంతోషపడుతూ గంటను మోగిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2017  సంవత్సరం నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందీ ఖచ్చితంగా తెలియలేదు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరగక ముందు నుంచే ఈ వీడియో సోషల్ మీడియాలో ఉంది, రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగాక కోతుల సమూహం ఎక్కడ ఇలా గంటను మోగించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో షేర్ చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘జై శ్రీరామ్’ అనే ఫేస్‌బుక్ పేజీ 09 జూలై 2017న పబ్లిష్ చేసినట్టు తెలిసింది

అంతే కాకుండా 2018లో ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ “డైలీ మెయిల్” వార్త కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం కోతుల గుంపు హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక హనుమాన్ ఆలయంలోని గంటతో ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన భక్తుడు ఈ వీడియోను తీసాడు. అలాగే రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగాక కోతుల సమూహం ఇలా గంటను మోగించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. దీన్ని బట్టి ఈ వీడియో అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగక ముందే తీసినట్టు నిర్ధారించవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోను అయోధ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత జరిగినట్లు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll