గోపాల్ పెట్ మండలంలోని ఎదుట్ల గ్రామంలో ఆవు కడుపులో మనిషి పుట్టాడని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గోపాల్ పెట్ మండలంలోని ఎదుట్ల గ్రామంలో ఆవు కడుపులో పుట్టిన మనిషి ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఫోటోలోని పిల్లాడు మనిషికే పుట్టాడు, ఆవుకు కాదు. ‘Anencephaly’ వ్యాధి వల్ల అలా పుట్టాడు. పుట్టడంతోనే ఆ పిల్లాడు చనిపోయాడు. అంతేకాదు, ఆ ఘటన జరిగింది రాజస్తాన్ లోని కాలాన్ద్రి ఊరులో, తెలంగాణలో కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని ఫోటోలలో గోడ పై ఉన్న హిందీ పదాలతో (‘सामुदायिक स्वास्थ्य केंद्र’) గూగుల్ లో టైం ఫిల్టర్ పెట్టి వెతకగా, అలాంటి ఫోటోతో కూడిన ఒక న్యూస్ ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో ఫోటోలోని ఘటన సిరోహి జిల్లా (రాజస్తాన్ రాష్ట్రం) లోని కాలాన్ద్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జరిగినట్టు తెలుస్తుంది.
అయితే, ఈ ఘటన గురించి మరింత సమాచారం కోసం వెతకగా, ఒక యూట్యూబ్ వీడియో దొరుకుతుంది. అందులో ఫోటోల్లో ఉన్న డాక్టర్ మాట్లాడుతూ, ‘ఆ ఫోటోలు కాలాన్ద్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో తీసినవే. పుట్టడంతోనే ఆ పిల్లాడు చనిపోయాడు. తల్లి క్షేమంగానే ఉందని’ అని చెప్తాడు. ఆల్ట్ న్యూస్ వారు కాల్ చేసి డాక్టర్ తో మాట్లాడినా ఇదే విషయం చెప్పాడు. కావున, ఫోటోల్లోని పిల్లాడు పుట్టింది మనిషికి మరియు ఆ ఘటన జరిగింది రాజస్తాన్ రాష్ట్రంలో, తెలంగాణలో కాదు.
ఫోటోల్లోని పిల్లాడు ‘Anencephaly’ వ్యాధి వల్ల అలా పుట్టాడు. ‘Anencephaly’ గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ చదవొచ్చు.
చివరగా, ‘గోపాల్ పెట్ మండలంలోని ఎదుట్ల గ్రామంలో ఆవు కడుపులో మనిషి పుట్టాడు’ అనేది ఫేక్ వార్త.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?