Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫాక్ట్ చెక్ వీడియోని క్లిప్ చేసి, ‘షారుక్ ఖాన్ పాకిస్థాన్ కు 45 కోట్ల విరాళం ఇచ్చాడు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘India Tv’ న్యూస్ ఛానల్ యొక్క వీడియో క్లిప్ ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, షారుక్ ఖాన్ పాకిస్థాన్ కు 45 కోట్ల విరాళం ఇచ్చాడు అని చెప్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: షారుక్ ఖాన్ పాకిస్థాన్ కు 45 కోట్ల విరాళం ఇచ్చాడు.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని క్లిప్ ‘India TV ’ న్యూస్ ఛానల్ వారి ఫాక్ట్ చెక్ వీడియో నుండి తీసుకోబడింది. ఆ న్యూస్ ఛానల్ వారు పూర్తి వీడియోలో పోస్టుల్లో పెట్టింది తప్పని చెప్తూ, షారుఖ్ ఖాన్ పాకిస్థాన్ ఆయిల్ టాంకర్ బ్లాస్ట్ బాధితుల కోసం 45 కోట్ల విరాళం ఇవ్వలేదని తేల్చారు. కావున పోస్ట్ లో చెప్పిందితప్పు.

పోస్టులోని క్లిప్ లో ఉన్న సమాచారం ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, దాని యొక్క పూర్తి వీడియో ‘India TV ’ న్యూస్ ఛానల్ అకౌంట్ లో లభించింది. వీడియోలో ఆ న్యూస్ ఛానల్ వారు షారుక్ ఖాన్ పాకిస్థాన్ కు 45 కోట్ల విరాళం ఇచ్చాడు అనే వార్త 2017 లో సోషల్ మీడియా లో చలామణీ అయినప్పుడు, అది తప్పు అని చెప్తూ చేసినది. అందులో ఛానల్ వారు ఆ విషయం గురించి స్పష్టత కోసం షారుక్ ఖాన్ మీడియా టీం ని సంప్రదించినప్పుడు, వారు ఆ వార్త నిరాధారమైనదని మరియు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్ ఆయిల్ టాంకర్ బ్లాస్ట్ బాధితుల కోసం ఎటువంటి విరాళం ఇవ్వలేదని తెలిపారని చెప్పి, సోషల్ మీడియా వార్త తప్పని తేల్చారు. ఆ వీడియో లో న్యూస్ రిపోర్టర్ షారుక్ ఖాన్ గతంలో భారత దేశం కోసం చేపట్టిన చారిటీ పనుల గురించి మరియు ఇచ్చిన విరాళాల గురించి చెప్తాడు.

25 జూన్ 2017 న పాకిస్తాన్ లోని బహావల్పూర్ లో ఒక ఆయిల్ టాంకర్ బోల్తాపడిన అనంతరం జరిగిన బ్లాస్ట్ లో సుమారు 150 పైగా మందికి చనిపోయారు. ఆ ఘటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ చదవవచ్చు.   

చివరగా, ‘India TV ’ ఫాక్ట్ చెక్ వీడియోలో కొంత భాగాన్ని క్లిప్ చేసి, ‘షారుక్ ఖాన్ పాకిస్థాన్ కు 45 కోట్ల విరాళం ఇచ్చాడు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll