కేంద్ర హోం శాఖ ఒక హెచ్చరిక జారీ చేసిందని, దాని ప్రకారం కొరోనావైరస్ కి సంబంధించి సోషల్ మీడియా గ్రూపుల్లో ఎటువంటి మెసేజులు కానీ, వీడియోలు కానీ పెట్టొద్దని, పెడితే వారు శిక్షర్హులని చెప్తూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. ఆ మెసేజ్ ని కేంద్ర హోం శాఖ లో ప్రిన్సిపల్ సెక్రటరీ గా పని చేసే రవి నాయక్ అనే వ్యక్తి జారీ చేసినట్లు ఉంది. దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కొరోనావైరస్ కి సంబంధించి సోషల్ మీడియా గ్రూపుల్లో ఎటువంటి మెసేజులు పెట్టినా శిక్షార్హులని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోం శాఖ.
ఫాక్ట్ (నిజం): కేంద్ర హోం శాఖ అటువంటి హెచ్చరిక జారీ చేసినట్లుగా న్యూస్ రిపోర్ట్స్ ఏమీ లభించలేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వారు కూడా హోం శాఖ అటువంటి హెచ్చరిక జారీ చేయలేదని స్పష్టం చేసింది. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో చెప్పినట్లుగా కొరోనావైరస్ కి సంబంధించి సోషల్ మీడియా గ్రూపుల్లో మెసేజులు పెట్టవద్దని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందా అని వెతికినప్పుడు, ఆ విషయాన్ని దృవీకరిస్తూ మీడియా న్యూస్ రిపోర్ట్స్ ఏమీ లభించలేదు. ఫేస్బుక్ పోస్టులో ఆ మెసేజ్ ని కేంద్ర హోం శాఖ లో ప్రిన్సిపల్ సెక్రటరీ గా పని చేసే రవి నాయక్ అనే వ్యక్తి జారీ చేసినట్లుగా ఉంది. కానీ, కేంద్ర హోం శాఖ వెబ్సైటు లో చూసినప్పుడు, అందులో రవి నాయక్ పేరుతో ఉన్న వ్యక్తి పని చేస్తున్నట్లుగా కానీ, ‘ప్రిన్సిపల్ సెక్రటరీ’ అనే హోదా కానీ లేదు.
పోస్టులోని మెసేజ్ వైరల్ అవడంతో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వారు కూడా హోం శాఖ అటువంటి హెచ్చరిక జారీ చేయలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, నెటిజేన్లు సురక్షితంగా ఉండడానికి కొరోనావైరస్ కి సంబంధించి కేవలం అధికారికమైన మరియు కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయమని తెలిపింది.
చివరిగా, కొరోనావైరస్ కి సంబంధించి సోషల్ మీడియా గ్రూపుల్లో ఎటువంటి మెసేజులు పెట్టినా శిక్షార్హులని కేంద్ర హోం శాఖ నుండి ఆదేశాలు వచ్చాయంటూ చలామణీ అవుతున్న వార్తలో నిజం లేదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?