Fake News, Telugu
 

భారత సైన్యం సంబరాలు అంటూ పోస్ట్ చేసిన వీడియో ఇప్పటిది కాదు. అది చాలా పాత వీడియో.

0

పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాల మీద భారత యుద్ధ విమానాలు దాడి చేసిన తరువాత భారత జవాన్లు సంబరాలు జరుపుకున్నారు అంటూ ఒక వీడియో చాలా పోస్ట్స్ లో షేర్ చేసారు. ఆ వీడియోని ఇప్పటివరకు చాలా మంది షేర్ చేసారు. వైరల్ అవుతున్న ఆ వీడియో లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): దాడి తరువాత జవాన్లు డాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియో దాడి తర్వాత తీసిన వీడియో కాదు. అది చాలా పాత వీడియో

య్యూట్యూబ్ లో ‘Indian Army Dance’  అని సెర్చ్ చేస్తే ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియో వస్తుంది. ఆ వీడియో యొక్క టైం స్టాంప్ చూస్తే అది గత సంవత్సరం ఏప్రిల్ లో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. కావున అది ఫేస్బుక్ లో షేర్ అవుతున్నట్టుగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాల మీద దాడి తరువాత భారత జవాన్లు డాన్స్ చేసిన వీడియో కాదు.

చివరగా, వైరల్ అవుతున్న భారత జవాన్ల సంబరాల వీడియో ఇప్పటిది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll