Fake News, Telugu
 

భారత ఆర్మీ పాక్ తో యుధ్ధానికి సిద్ధం అవుతోంది అంటూ పెట్టిన వీడియో వాస్తవమైనది కాదు, అది ఒక పాత వీడియో

0

పుల్వామా ఘటన పై ప్రతీకార చెర్య  గా భారత ఆర్మీ పాకిస్థాన్ పై యుధ్ధానికి సన్నాహాలు చేస్తోంది  అంటూ మిలిటరీ ట్రైన్ వీడియోని చాలా మంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియో ఎంతవరకు నిజమో విశ్లేషిద్దాం .  

క్లెయిమ్ (దావా): భారత ఆర్మీ పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్ధం అవుతున్న వీడియో

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియో ని ఇన్విడ్ ఎక్స్టెన్షన్ లో సెర్చ్  చెయ్యగా వచ్చిన ఫ్రాగ్మెంట్స్  ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్  చేసినప్పుడు ఫ్రాగ్మెంట్స్ లో లభించిన సమాచారం ఆధారంగా యుట్యూబ్ లో వెతికినప్పుడు  ‘తెహచాపి అనే ప్రదేశం మీదిగా తరలించబడ్తున్న మిలిటరీ ట్రైన్’  అనే సమాచారం తో మరో పాత వీడియో లభించింది . కావున ఫేస్బుక్ పోస్ట్ లో ఆరోపించినట్టుగా ఈ  వీడియో పుల్వామా ఘటన కి ప్రతీకారం గా భారత ఆర్మీ పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్ధం అవ్వడానికి  సంబంధించినది మాత్రం కాదు .  

చివరగా, ఈ వీడియో  భారత ఆర్మీ పాక్ తో యుద్ధానికి సిద్ధం అవుతున్నది  కాదు.ఇది ఒక పాత వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll