Fake News, Telugu
 

పోస్ట్ లో మోడీ కి సంబంధించి ఉన్నది ఫోటోషాప్ చేయబడిన ఫోటో

0

ప్రధాని మోడీ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా  ఉన్న ఫోటో మరియు కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్ ఒక సామాన్య పౌరుడిగా జీవిస్తున్నట్లుగా ఉన్న ఫోటోతో కూర్చిన చిత్రాన్ని ఒక దాన్ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్నవి ఎంతవరకు వాస్తవాలు అనేది ఒకసారి విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ప్రధాని మోడీ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు మరియు కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్ సామాన్య పౌరుడిగా జీవిస్తున్నారు

ఫాక్ట్ (నిజం): ప్రధాని మోడీ విలాసవంతంగా తింటున్నట్టుగా ఉన్నచిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు దాని ఒరిజినల్ ఇమేజ్ Timescontent.com లో లభించింది. ఈ ఫోటోని ఫోటోషాప్ చేసి ఫేస్బుక్ లో తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారు. కావున, ఈ పోస్ట్ లో చూపెట్టింది తప్పు.

ఎవరు ప్రజలకోసం పనిచేసే నేత ..? అంటూ ప్రధాని మోడీ విలాసవంతమైన భోజనం తింటున్నట్టుగా ఉన్న ఫోటోని మరియు కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్ సామాన్య పౌరుడిగా తింటున్నటువంటి ఫోటోని కూర్చిన చిత్రాన్ని పోస్ట్ చేసారు. అందులో ప్రధాని మోడీకి సంబంధించిన చిత్రాన్నిస్క్రీన్ షాట్ తీసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు దాని ఒరిజినల్ ఇమేజ్ Timescontent.com లో లభించింది. అందులో ఉన్న సమాచారాన్ని పట్టి ఈ చిత్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ  ఉన్నప్పుడు గాంధీనగర్ లో పాత్రికేయులకు దీపావళి సందర్భంగా నవంబరు 12, 2008 న ఏర్పాటు చేసిన విందుకు సంబంధించినది అని తెలిసింది. కానీ, దాన్ని ఫోటోషాప్ చేసి మోడీ ఎదో విందు భోజనం తింటున్నట్టుగా  చూపిస్తున్నారు

చివరగా, పోస్ట్ లో మోడీ కి సంబంధించి ఉన్నది ఫోటోషాప్ చేయబడిన ఫోటో.

Share.

About Author

Comments are closed.

scroll