పట్టుబడ్డ పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ భార్య కి సంబంధించిన వీడియో క్లిప్ అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు . ఆ పోస్టు ల్లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.
క్లెయిమ్ (దావా): అభినందన్ భార్య నీచ రాజకీయాలు వద్దని BJP రాజకీయ నాయకులకు చేసిన విన్నపం
ఫాక్ట్ (నిజం): ఆ మహిళ, కమాండర్ అభినందన్ కుటుంబాన్ని ఒక మూడో వ్యక్తిగా సంభోదిస్తోంది . కావున ఆమె అభినందన్ భార్య కాదని స్పష్టమవుతుంది. అంతేకాక, అతని భార్య కి సంబంధించి మీడియా లో చలామణి లో ఉన్న ఛాయాచిత్రాలను ఈ వీడియో క్లిప్ లో ఉన్న స్త్రీ ఛాయాచిత్రాలతో పోల్చితే అవి సరిపోలలేదు. కావున అందులో ఉన్నది అభినందన్ భార్య కాదు
వీడియోలో మహిళ చేసిన వాంగ్మూలాలను విన్నప్పుడు, “నేను ఒక సైన్యం అధికారికి భార్యను” అని చెప్పడం తో ప్రారంభమవుతుంది.ఇంకా ముందుకు వెళ్తే “…ఈ క్షణం లో అభినందన్ కుటుంబం అనుభవిస్తున్న ఉద్రిక్తత మరియు బాధ గురించి ఆలోచించండి” అంటూ ప్రసంగిస్తుంది. ఆ మహిళ, కమాండర్ అభినందన్ కుటుంబాన్ని ఒక మూడో వ్యక్తిగా సంభోదిస్తోంది . కావున ఆమె అభినందన్ భార్య కాదని స్పష్టమవుతుంది. అంతేకాక, అతని భార్య కి సంబంధించి మీడియా లో చలామణి లో ఉన్న ఛాయాచిత్రాలను ఈ వీడియో క్లిప్ లో ఉన్న స్త్రీ ఛాయాచిత్రాలతో పోల్చితే అవి సరిపోలలేదు.
వీడియో లో యువతీ అసలు పేరు శిరీష రావు. బూమ్ లైవ్ అనే సంస్థతో శిరీష మాట్లాడుతూ ఇలా స్పందించింది “నేను ఆ వీడియో లో చాల క్లియర్ గ ఆర్మీ ఆఫీస్ భార్య ని అని చెప్పను. మన అందరికి వర్థమాన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ అని తెలుసు. మరి అందరు నేను తన భార్య ని అని ఎందుకు వీడియో షేర్ చేస్తున్నారో అర్థం కావటం లేదు”
చివరగా, పోస్ట్ లో చెప్పినట్టుగా వీడియో క్లిప్ లో ఉన్నది వింగ్ కమాండర్ అభినందన్ భార్య కాదు.