Fake News, Telugu
 

2013లో కైరోలో జరిగిన నిరసన వీడియోను, హమాస్ ఫేక్ మరణాలను ప్రదర్శిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0


బ్రతికి ఉన్న వారిని చచ్చిపోయినట్టు చూపి సానుభూతి పొందాలనుకుంటున్న హమాస్ తీవ్రవాద సంస్థ’ అంటూ, కొంత మంది వ్యక్తులు మూకుమ్మడిగా నేలపై తెల్లని బెడ్ షీట్లు పడుకున్న వీడియోను షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: హమాస్,  సానుభూతి కోసం బ్రతికి ఉన్న వారిని చచ్చిపోయినట్టు చూపిస్తున్న వీడియో. 

ఫాక్ట్(నిజం): ఇది 2013లో ఈజిప్టులోని కైరో యొక్క అల్-అజార్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల బృందం “anti-coup” నిరసనలో పాల్గొంటున్న వీడియో. దీనికి, ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యకి సంబంధం లేదు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు. 

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతకగా, ఈ వీడియోను షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు అని తెలుసుకున్నాం. ఉదాహరణకు, 2014లో, కన్జర్వేటివ్ పోస్ట్  ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇది హమాస్ ఇస్లామిక్ అంత్యక్రియలను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. 

దీని గురించి మరింత వెతకగా, ఇది వాస్తవానికి 2013లో ఈజిప్టులోని కైరో యొక్క అల్-అజార్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల బృందం “anti-coup” నిరసనలో పాల్గొంటున్న సందర్భంలోని వీడియో అని ఈజిప్టు వార్తా సంస్థలు అల్ బాడిల్ మరియు ఆఖ్బర్ ఎల్ యోమ్  అనే యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తెలుసుకున్నాం.

క్యాప్షన్ ఆధారంగా, అల్-అజార్ విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసనల గురించి వెతకగా,  పలు వార్తా పత్రికలు దీని గురించి వివరించటం గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). కైరోలో ఈ నిరసన అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీని, సాయుధ బలగాలు తొలగించినందుకు ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ, భద్రతా దళాలకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించింది. ఈ వీడియోలో చేసిన నిరసన అందులో ఒక భాగం.  

చివరిగా, 2013లో కైరోలో జరిగిన నిరసన వీడియోను, హమాస్ ఫేక్ మరణాలను ప్రదర్శిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll