Fake News, Telugu
 

ఆకాశం లో గుర్రం ఎగురుతున్నట్టు ఉన్న వీడియో కోణార్క్ కి సంబంధించింది కాదు

0

ఒరిస్సా లోని కోణార్క్ లో వింత అంటూ ఒక వీడియో తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఒరిస్సాలోని కోణార్క్ లో వింత. ఆకాశంలో సూర్యభగవానుడి రథం నుండి విడిపోయిన అశ్వం కనిపించింది.

ఫాక్ట్ (నిజం): ఇదే వీడియోని ఇండోనేషియా లో తీసినట్టుగా గత నెల లోనే కొంత మంది వీడియోలు పెట్టారు. అలానే వీడియో మొదట్లో కూడా ఒడియా కాకుండా ఎదో చైనీస్ లాంగ్వేజ్ వినపడుతుంది. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా వీడియో కోణార్క్ కి సంబంధించింది కాదు.

వీడియోలోని మాటలు సరిగ్గా వింటే అది ఒడియా బాష లాగా అనిపించదు. వీడియోలో కుడి వైపు కింద ఏదో బాషలో రాసి కూడా ఉంటుంది. కాబట్టి గూగుల్ లో ‘Horse running in the sky’ అని వెతికితే, ఇదే వీడియోని చాలా మంది వివిధ సోషల్ మీడియా వెబ్ సైట్లల్లో ఏప్రిల్ లోనే పెట్టినట్టు చూడవచ్చు. ఒక వీడియో కింద వివరణ చూస్తే అది ఇండోనేషియా లో తీసినట్టు ఉంటుంది. ఆ వీడియో లో ‘అల్లాహు అక్బర్’ అని మనిషి అరుస్తున్నట్టు వినొచ్చు. కాబట్టి అది కోణార్క్ లో తీసిన వీడియో కాదనే నిర్దారణకు రావొచ్చు. నిజంగా వీడియో లో చుపెట్టినట్టుగా గుర్రం ఆకాశంలో కనిపించిందా లేదా అని కచ్చితంగా చెప్పడానికి ఇంటర్నెట్ లో ఆధారాలు దొరకలేదు, కానీ ఎడిట్ చేసి వీడియోలో గుర్రాన్ని పెట్టే అవకాశం మాత్రం ఉంది.

చివరగా, ఆకాశం లో గుర్రం ఎగురుతున్నట్టు ఉన్న వీడియో కోణార్క్ కి సంబంధించింది కాదు.

ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చుడండి

Share.

About Author

Comments are closed.

scroll