Fake News, Telugu
 

పోలీసు అధికారి భక్తులను తోసివేస్తున్న వీడియో తిరుమలది కాదు

0

తిరుపతి ఆలయం లో ఈ పోలీస్ ఓవర్ ఆక్షన్ చుడండి, ప్రభుత్వనికి చేరేలా షేర్ చేయండి’ అంటూ ఒక పోలీస్ అధికారి భక్తులను తోసివేస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఆరోపించిన దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరుపతి గుడిలో పోలీసు అధికారి భక్తులను తోసివేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో ఉత్తర్ ప్రదేశ్ లోని బాంకే బిహారీ గుడిలో ఒక పోలీసు అధికారి భక్తులను తోసివేస్తున్న సంఘటనకి సంబంధించినది. కావున, ఆ వీడియో లోని ఘటన తిరుపతి గుడిలో జరిగిందనేది అబద్ధం.

పోస్టులో పెట్టిన వీడియో గత రెండు సంవత్సరాలుగా ఫేస్బుక్ లో అదే ఆరోపణతో చలామణి అవుతోంది. ఆ వీడియో ని ‘Amaravati –AP Capital’ అనే ఫేస్బుక్ పేజీ ఏప్రిల్ 17, 2017 లో పెట్టినట్లుగా చూడవచ్చు. అప్పటి నుండి ఆ వీడియోని సుమారుగా యాభై లక్షల మంది చూసారు మరియు లక్ష ఇరువై ఆరు వేల మంది షేర్ చేసారు.

అలాగే, ‘మన ప్రకాశం జిల్లా’ అనే ఫేస్బుక్ పేజీ ఏప్రిల్ 20, 2017 లో అదే వీడియో ని పోస్టుచేసింది.  దానిని సుమారుగా పది లక్షల మంది చూసారు మరియు ఇరవై ఐదు వేల మంది షేర్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడు అవ్వడం మరియు ప్రస్తుతం అతని పై వస్తున్న అనేక మతపరమైన ఆరోపణల వల్ల మళ్ళీ ఆ వీడియో ఇప్పుడు చలామణి అవుతోంది. 

పోస్టులో పెట్టిన వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన చాలా కీఫ్రేమ్స్ వచ్చాయి. వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోతో కూడిన ఒక న్యూస్ వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. ఆ వీడియోని ‘APN’ అనే యూట్యూబ్ న్యూస్ ఛానల్ 2014లో అప్లోడ్ చేశారు. ఆ న్యూస్ ఛానల్ సమర్పకురాలు, ఆ వీడియో ఉత్తర్ ప్రదేశ్ లోని బాంకే బిహారీ గుడి లో జరిగిన సంఘటనకి సంబంధించినదనీ, భక్తుల రద్దీ ఎక్కువ అవడం చేత ఆ పోలీసు అధికారి అలా చేసి ఉంటాడనీ, అతను చేసిన ఆ పనికి చాలా విమర్శలు వస్తున్నాయని తెలిపింది.

ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే, అందులో కనిపించే సైడ్ స్తంభాలు మరియు ఆకుపచ్చ వస్త్రం బాంకే బిహారీ ఆలయంలో ఉపయోగించే వాటిని పోలి ఉండడం చూడవచ్చు.

గతం లో తిరుపతి దేవాలయానికి సంబంధించి జగన్ పై వచ్చిన కొన్ని ఆరోపణలు తప్పు అని తేల్చిన ‘Factly’ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదువవచ్చు.

చివరగా, ఒక పోలీసు అధికారి భక్తులను తోసివేస్తున్న వీడియో తిరుపతి గుడిలోనిది కాదు. అది ఉత్తర్ ప్రదేశ్ లోని బాంకే బిహారీ గుడిలో జరిగిన సంఘటనకి సంబంధించినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll