Fake News, Telugu
 

పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమైన వాయు దళాలు అనే వీడియోలో ఉన్నవి భారత విమానాలు కావు. అవి అమెరికాకి చెందిన F-16 విమానాలు

0

పాకిస్తాన్ మీద దాడి చేయడానికి భారత వాయు దళాలు సిద్ధమయ్యాయి అంటూ ఒక వీడియోని ‘Mahender Reddy Kondeti’ అనే వ్యక్తి తన ఫేస్బుక్ వాల్ పై పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): వీడియో లో ఉన్నవి భారత యుద్ధ విమానాలు. పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమైన వాయు దళాలు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టుగా వీడియో లో ఉన్నవి భారత యుద్ధ విమానాలు కావు. అవి అమెరికాకి చెందినా F-16 విమానాలు.

పోస్ట్ చేసిన వీడియో ని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఆ వీడియో లో ఉన్నవి అమెరికా కి చెందిన F-16 విమానాలు అని తెలుస్తుంది. అలానే య్యూట్యూబ్ లో ‘American F-16 planes on runway’ అని సెర్చ్ చేస్తే ఫేస్బుక్ లో షేర్ అవుతున్న వీడియో వస్తుంది. ఆ వీడియో యొక్క టైం స్టాంప్ చూస్తే ఆ వీడియోని 2013 లో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది.

చివరగా, పోస్ట్ చేసిన వీడియోలో ఉన్నవి భారత యుద్ధ విమానాలు కావు. అవి అమెరికాకి చెందిన F-16 విమానాలు.

Share.

What Do You Think?

scroll