శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతున్న కరోన రోగులకు ఒక కప్పు నీటిలో Aspidosperma-Q హోమియోపతి ఔషధం 20 చుక్కలు కలిపి ఇవ్వడం ద్వార వారి శరీరంలో ఆక్సిజన్ స్థాయి వెంటనే మెరుగుపడుతుందని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. కరోనా రోగులు ఆక్సిజన్ సిలిండర్ల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా Aspidosperma-Q ఔషధాన్ని వాడాలని ఈ పోస్టులో సలహా ఇస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: Aspidosperma-Q హోమియోపతి ఔషధం వాడటం ద్వార కరోనా రోగుల ఆక్సిజన్ స్థాయి వెంటనే మెరుగవుతుంది.
ఫాక్ట్ (నిజం): మెడికల్ ఆక్సిజన్ కి ప్రత్నామ్యాయంగా Aspidosperma-Q హోమియోపతి ఔషధాన్ని ఉపోయోగించాలని ఆయుష్ మంత్రుత్వ శాఖ చెప్పలేదు. Aspidosperma-Q ఔషధానికి సంబంధించి షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పని ఆయుష్ మంత్రుత్వ శాఖ ట్వీట్ చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా వుంది.
ఆయుష్ మంత్రుత్వ శాఖా కింద పనిచేస్తున్న ‘The Central Council for Research in Homoeopathy’ (CCRH) సంస్థ, కరోనా రోగుల చికిత్సకు సంబంధించి హోమియోపతి డాక్టర్లకి కొన్ని మార్గనిర్దేశాలు జారీ చేసింది. CCRH ఇచ్చిన ఈ నిర్దేశాలలో Aspidosperma-Q ఔషధాన్ని ఆక్సిజన్ సిలిండర్లకి ప్రత్నామ్యాయంగా ఉపయోగించుకోవాలని ఎక్కడ పేర్కొనలేదు. ఆయుష్ మంత్రుత్వ శాఖా కరోనా వైరస్ వైద్యానికి సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో Aspidosperma-Q ఔషధం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.
Aspidosperma-Q ఔషధానికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ సమాచారం గురించి Indian Institute of Homoeopathic Physicians (IIHP) సైంటిఫిక్ కమిటీ చైర్మన్ Dr. ముక్తిందర్ సింగ్ స్పష్టతనిచ్చారు. కోవిడ్-19 వైరస్ పై Aspidosperma-Q ఔషధ సామర్థ్యానికి సంబంధించి వైద్యపరంగా దృవికరించబడిన సమాచారం తమ వద్ద లేదని ముక్తిందర్ సింగ్ స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో Aspidosperma-Q కు సంబంధించి షేర్ అవుతున్న ఈ వదంతువులని ప్రజలు నమ్మవద్దని ముక్తిందర్ సింగ్ హెచ్చరించారు.
పబ్లిక్ హెల్త్ వివరాల పై సమాచారం అందించే Health Desk వెబ్ సైట్ కూడా Aspidosperma-Q ఔషధానికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ పోస్టులు తప్పని తెలిపింది. Aspidosperma-Q ఔషధం ఉపయోగించడం ద్వారా శరీరంలోని ఆక్సిజన్ స్థాయి వెంటనే పెరుగుతుందని చెప్పడానికి సరిపడ శాస్త్రీయ ఆధారాలు లేవని ఈ వెబ్సైటులో స్పష్టం చేసారు.
Aspidosperma-Q హొమియోపతీ మెడిసిన్ ద్వార కరోనా రోగుల ఆక్సిజన్ లెవెల్ మెరుగుపరుచుకోవచ్చని షేర్ అవుతున్నఈ సమాచారం తప్పని PIB ట్వీట్ చేసింది. Aspidosperma-Q ఔషధం వాడటం ద్వార శరీరంలోని ఆక్సిజన్ స్థాయి కంట్రోల్ అవ్వదని PIB ఈ ట్వీట్ లో స్పష్టం చేసింది. ఇదే విషయాన్నీ తెలుపుతూ ఆయుష్ మంత్రుత్వ శాఖా కూడా ట్వీట్ పెట్టింది.
చివరగా, Aspidosperma-Q ఔషధం ఆక్సిజన్ అవసరం ఉన్న కరోనా రోగుల్లో ఆక్సిజన్ కి ప్రత్యామ్నాయంగా వాడకూడదు.