Fake News, Telugu
 

కేరళలో హార్డింగ్ మీద గోమాంసం తినాలనుకుంటే కాంగ్రెస్ కి ఓటు వేయమని రాసి లేదు.

0

కాంగ్రెస్ పార్టీ కేరళలో ఎన్నికల ప్రచార నేపథ్యంలో గోమాంసం తినాలనుకుంటే తమకే ఓటు వేయమంటూ ఒక హార్డింగ్ పెట్టిందని ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కాంగ్రెస్ హార్డింగ్ మీద “గోమాంసం తినాలనుకుంటే కాంగ్రెస్ ను గెలిపించండి” అని రాసి ఉంది.

ఫాక్ట్ (నిజం): హార్డింగ్ మీద మలయాళంలో రాసి ఉన్న దాన్ని తెలుగులోకి అనువదిస్తే “ఆహార అలవాట్ల పేరు మీద చంపడమా? ఈ దేశంలో? ఈ కాలంలో? ఆది మానవుల నియమాలు మాకు వద్దు! కాంగ్రెస్ కి ఓటు వేయండి!” అని ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

కేరళలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెట్టిన హార్డింగ్ మీద మలయాళంలో రాసిన దాన్ని తెలుగులోకి అనువదిస్తే “ఆహార అలవాట్ల పేరు మీద చంపడమా? ఈ దేశంలో? ఈ కాలంలో? ఆది మానవుల నియమాలు మాకు వద్దు! కాంగ్రెస్ కి ఓటు వేయండి!” అని వస్తుంది. పోస్ట్ లో చెప్పినట్టుగా గోమంసం గురించి హార్డింగ్ మీద ఎక్కడా కూడా లేదు. హార్డింగ్ మీద మనుషులను చంపుతున్నారని కాంగ్రెస్ అడుగుతుంటే, పోస్ట్ లో గోవులను చంపడాన్ని కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్నట్టు రాసారు. కావున పోస్ట్ లో చెప్పినటుగా కాంగ్రెస్ పార్టీ గోమంసం మీద ఓట్లు అడగట్లేదు

చివరగా, కాంగ్రెస్ హార్డింగ్ మీద మలయాళంలో “గోమాంసం తినాలనుకుంటే కాంగ్రెస్ ను గెలిపించండి” అని రాసి లేదు.

Share.

About Author

Comments are closed.

scroll