Fake News, Telugu
 

ఉగ్రవాదులు మన దేశంలోకి వస్తున్న పాత వీడియో పెట్టి ‘కాశ్మీర్ లో హైఅలెర్ట్’ అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

0

‘కాశ్మీర్ లో హైఅలెర్ట్’ అని చెప్తూ భారతలో ఆత్మహుతి దాడులు చేయడానికి పాకిస్తాన్ టెర్రరిస్టులను పంపుతుందని ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : కాశ్మీర్ లో హైఅలెర్ట్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆత్మహుతి దాడుల జరిపేందుకు టెర్రరిస్టులను భారత్ లోకి పంపిస్తున్న పాకిస్థాన్.    

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో పెట్టింది ఒక పాత వీడియో. ఇదే వీడియోని ‘Times Now’ వారు గత సంవత్సరం జూలై లోనే తమ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టు చూడవచ్చు. కావున పోస్ట్ లో పాత వీడియో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.    

పోస్ట్ చేసిన వీడియోలో ఇరవై రెండు సెకండ్ల దగ్గర వారు ‘తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్’ సంస్థకి చెందినవారని ఒక వ్యక్తి చెప్తాడు. కావున యూట్యూబ్ లో ‘Tehreek-ul-Mujahideen’ అని వెతికగా, పోస్ట్ లోని వీడియోనే గత సంవత్సరం జూలై లో ‘Times Now’ వారు తమ అకౌంట్ లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

అంతేకాదు, అదే వీడియోని ‘Times Now’ వారు తమ ట్విట్టర్ అకౌంట్ లో కూడా గత సంవత్సరమే పోస్ట్ చేసినట్టు చూడవచ్చు

చివరగా, ఉగ్రవాదులు మన దేశంలోకి వస్తున్న పాత వీడియో పెట్టి ‘కాశ్మీర్ లో హైఅలెర్ట్’ అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll