రాజధాని అమరావతి కోసం ప్రాణ త్యాగం చేసిన రైతు’ అని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ‘Prime 9’ వార్తాసంస్థ కూడా ఆ వార్తను చూపెట్టినట్టుగా వాళ్ళ వీడియోని కూడా కొందరు ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: రాజధాని అమరావతి కోసం ప్రాణ త్యాగం చేసిన రైతు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే సంబంధించింది కాదు. వీడియోలోని సంఘటన తమిళనాడు లోని మధురై లో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి భారత ఆర్మీలో పనిచేస్తున్నాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించిన ఫోటోలు పెట్టి వార్తాసంస్థలు రాసిన చాలా ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ‘DT Next’ అనే వార్తాసంస్థ ప్రచురించిన ఆర్టికల్ లో ఆ వీడియో తమిళనాడులోని మధురై లో జరిగినట్టు చూడవొచ్చు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి భారత ఆర్మీ లో పనిచేస్తున్నాడని కూడా ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. తన ఆత్మహత్యకి గల కారణాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. కావున, వీడియోలోని సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే సంబంధించింది కాదు
చివరగా, మధురై లో జరిగిన ఘటన వీడియో పెట్టి, ‘రాజధాని అమరావతి కోసం ప్రాణ త్యాగం చేసిన రైతు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?