Fake News, Telugu
 

స్క్రిప్టెడ్ వీడియోని పిల్లలు పుట్టడం కోసం ఒక మహిళ కాళ్ళు చేతులు కట్టేసి మురుగునీటిలో పడేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

పిల్లలు పుట్టడంలేదని ఒక వ్యక్తి తన భార్యను 11 రోజులు తిండి పెట్టకుండా మురుగునీటిలో కాళ్ళు చేతులు కట్టేసి పడేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. మురుగునీటిలో 11 రోజులు తిండి నీరు తాగకుండా ఉంటే వారికీ సంతానం లభిస్తుందని ఒక యోగి చెప్పడంతో, మహిళ భర్త, అత్తయ్య, ఆమెను నీటిలో కట్టిపడేసినట్టు తెలుపుతున్నారు. సామాజిక చైతన్యం వస్తే తప్ప ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పిల్లలు పుట్టడం కోసం ఒక మహిళను కాళ్ళు చేతులు కట్టేసి మురుగునీటిలో పడేసిన దృశ్యాలు.  

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. అంకుర్ జటుస్కరన్ అనే కంటెంట్ క్రియేటర్, ఈ వీడియోని ఎంటర్టైన్మెంట్ మరియు ప్రజలలో సామాజిక అవగాహన పెంపొంధించాలనే ఉద్దేశంతో రూపొందించారు. ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టు వివరణ భాగంలో ఇటువంటి మరికొన్ని ఒరిజినల్ వీడియోల కోసం అంకుర్ జటుస్కరన్ ఫేస్‌బుక్ పేజీని క్లిక్ చేయండి అని ఒక ఫేస్‌బుక్ లింక్ జతచేసి ఉంది. ఈ వివరణ ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఈ వీడియోని అంకుర్ జటుస్కరన్ 16 డిసెంబర్ 2022 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

ఈ వీడియోని ఎంటర్టైన్మెంట్ మరియు ప్రజలలో సామాజిక అవగాహన పెంపొంధించాలనే ఉద్దేశంతో రూపొందించినట్టు వీడియోలో చూపించిన వివరణలో తెలిపారు. మూఢనమ్మకాలను ప్రజలు నమ్మకూడదనే ఆలోచనతో ఈ వీడియోని రూపొందించారు. అంకుర్ జటుస్కరన్ రూపొంధించిన మరికొన్ని స్క్రిప్టెడ్ వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఒక స్క్రిప్టెడ్ వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

చివరగా, స్క్రిప్టెడ్ వీడియోని పిల్లలు పుట్టడం కోసం ఒక మహిళ కాళ్ళు చేతులు కట్టేసి మురుగునీటిలో పడేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll