భారతదేశం అంతటా వివిధ చోట్ల గ్రహాంతర వాసుల వాహనాలు, UFO/UAP-అనైడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్/అనైడెంటిఫైడ్ అనామౌలస్ ఫెనోమెనా-వచ్చాయని, మన దేశానికి గ్రహాంతర వాసులు వచ్చారని క్లెయిమ్ చేస్తున్న వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల భారతదేశం అంతటా UFO/UAPలు కనిపించినప్పుడు తీసిన వీడియోలు.
ఫ్యాక్ట్(నిజం): భారతదేశంలో గ్రహాంతరవాసులు ల్యాండ్ అయ్యారు అని చేస్తున్న క్లెయిమ్‌ను ధృవీకరించడానికి ఎటువంటి విశ్వసనీయమైన వార్తా కథనాలు లేవు. ఈ వీడియోలు అన్ని పాతవి మరియు డిజిటల్‌గా రూపొందించబడ్డాయి. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించడానికి, UFO/UAP వీక్షణలను భారతీయ మీడియా రిపోర్ట్ చేసిందో లేదో తెలుసుకోవడానికి మేము ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేశాము. అయితే, ఈ సెర్చ్ ద్వారా మాకు వైరల్ వీడియోలలో చేసిన క్లెయిమ్‌లను ధృవీకరించే ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. మన దేశంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే, ప్రధాన మీడియా సంస్థలు తప్పకుండా అ విషయాన్ని రిపోర్ట్ చేస్తాయి. ఏలియన్ లేదా UFO/UAPని గుర్తించడం అనేది గ్లోబల్ న్యూస్‌గా మారి, మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించేవి. అయితే, ఇక్కడ అలా జరగలేదు, భారత్‌లో గ్రహాంతర వాసులు లేదా ఏలియన్స్ వచ్చాయి అని ఒక్క వార్తా కథనం కూడా లేదు.
అంటే వైరల్ అవుతున్న ఈ వీడియోలు భారతదేశంలో జరిగిన యదార్థ సంఘటనలను చూపించడం లేదని మనకి స్పష్టం అవుతుంది. ఫ్యాక్ట్లీ పరిశోధనలో, ఈ వీడియోలను AI, VFX లేదా డిజిటల్ సిమ్యులేషన్ టూల్స్ ఉపయోగించి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు సృష్టించారని అర్థం అయ్యింది. గ్రహాంతర వాసి అంతరిక్ష నౌకను డీ బిల్డింగ్ చేసి దాని కింద నడుస్తున్నట్లు చూపే వీడియో జనవరి 2012 నుండి ఇంటర్నెట్‌లో చైనీస్ టెక్స్ట్‌ను కలిగి ఉంది, ఈ వీడియో ఇటీవల రాజస్థాన్‌లో తీసిందనే వాదనకు ఇది విరుద్ధంగా ఉంది. వైరల్ వీడియోల గురించి మరిన్ని విరవరాలను మీరు క్రింద చూడవచ్చు.
ముందుగా, ఈ వీడియో క్లిప్‌లో ఒక వాటర్‌మార్క్‌ను మేము గమనించాము, అందులో ‘@sybervisions_’ అనే టెక్స్ట్ ఉంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి, మేము ఇంటర్నెట్‌లో ‘@sybervisions_’ కోసం సెర్చ్ చేయగా మాకు దీని అసలు వీడియో లభించింది (ఇక్కడ మరియు ఇక్కడ). @sybervisions_ అదే యూజర్ యొక్క Instagram మరియు YouTube ఛానెల్‌లో ఈ వీడియో మాకు లభించింది.
ఈ పేజీలోని బయో సెక్షన్‌లో, సైబర్‌విజన్ AI-VFX ఆర్టిస్ట్ మరియు ఫిల్మ్ మేకర్ అని పేర్కొన్నారు. అలాగే అసలు వీడియో యొక్క పోస్ట్‌లో ‘#aigenerated’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ఉంది. దీన్ని బట్టి ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన సంఘటన కాదు అని మనకి స్పష్టం అవుతుంది.
ఈ వీడియో నుండి కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, జనవరి 2013 నాటి ఒక పాత YouTube వీడియో మాకు దొరికింది (ఇది కూడా). వైరల్ వీడియోలో కనిపించే క్లిప్ ( ఆన్-క్రాప్డ్ వెర్షన్) ఈ వీడియోలో ఉంది. దీన్ని 2:23 సెకన్ల టైమ్‌స్టాంప్ నుండి మనం చూడవచ్చు.
ఈ వీడియోలో చైనీస్ భాషలో ఓపెనింగ్ టైటిల్స్ మరియు ఇంటర్‌టైటిల్స్ ఉన్నాయి. అలాగే దానిలో ఉన్న వాళ్ళు మాట్లాడే భాష కూడా చైనీస్ లాగా ఉంది. ఈ టైటిల్స్ ప్రకారం, ఈ సంఘటన 14 సెప్టెంబర్ 2012న చైనాలోని బీజింగ్ సమీపంలో జరిగింది. ఈ విషయాన్ని రుజువు చేయడానికి, చైనా నుండి మాకు ఎటువంటి విశ్వసనీయమైన వార్తా కథనాలు లభించలేదు. ఈ వీడియో ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన సంఘటనను చూపడం లేదని ఈ ఆధారాలు మనకు స్పష్టం చేస్తాయి. అదనంగా చైనీస్ మరియు ఇతర వెబ్‌సైట్‌లలో ఉన్న ఈ వీడియో యొక్క పాత అప్‌లోడ్‌లను మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియో యొక్క కీఫ్రేమ్‌లను ఉపయోగించి ఒక ఇంటర్నెట్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోని VFX-AI ఆర్టిస్ట్ మరియు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయిన ‘బిలావల్’ రూపొందించారని మేము కనుగొన్నాము. అతను ఇలాంటి అనేక VFX వీడియోలను తన YouTube ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాడు.
ఈ వీడియోని కూడా ‘బిలావల్’ తయారు చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు.
ఈ వీడియో క్లిప్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా క్రియేటర్ ‘chaos_factory1’ అప్లోడ్ చేశారు. Chaos factory 1 వాళ్లు DCS (డిజిటల్ కంబాట్ సిమ్యులేటర్)తో తయారు చేసిన వీడియోలను (ఇక్కడ మరియు ఇక్కడ), సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. DCS ఉపయోగించి యూజర్లు వివిధ ఎయిర్ ప్లేన్లను సిమ్యులేటేడ్ వాతావరణంలో ఆపరేట్ చేయవచ్చు.
వైరల్ వీడియోలో ఈ పేజీ పేరు (chaos_factory1) యొక్క వాటర్‌మార్క్ ఉంది. ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన అనేక ఇన్‌స్టాగ్రామ్ పేజీలు (ఇక్కడ మరియు ఇక్కడ) ‘chaos_factory1 యొక్క టిక్‌టాక్ ఈ వీడియోకి సోర్స్ అని క్రెడిట్ ఇచ్చారు.
ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ ‘ఇర్విన్ సౌండర్స్’ అనే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ తయారు చేసి ఏప్రిల్ 2022లో అప్లోడ్ చేశారు(ఫేస్‌బుక్ లింక్). ఈయన యూట్యూబ్ ఛానల్ యొక్క అబౌట్ సెక్షన్ ప్రకారం ఈయన బ్రిటన్ ప్రాంతం వ్యక్తి.
ఈయన ఛానల్‌లో ‘పిక్సీ’ అనే పేరు గల జీవిలను ఈయన అడవుల్లో చూసి, ఫిల్మ్ చేసినట్లు ఉన్న కొన్ని వీడియోలు ఉంటాయి. పిక్సీ జీవుల గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా, ఇవి బ్రిటిష్ folklore(జానపద సాహిత్యం)లో ఉన్న ఒక జీవి అని మాకు తెలిసింది. ఇవి నిజంగా జీవిస్తున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు.
‘ఇర్విన్ సౌండర్స్’ యొక్క ఛానల్‌లో ఉన్న వీడియోలను మరియు యూజర్లు చేసిన కామెంట్స్ చూడగా, ఈ వీడియోలు అన్ని ఫిక్షనల్ (పిక్సీ జీవులని VFX ద్వారా తయారు చేసి ఉండవచ్చు) అని మాకు అర్థం అయింది. అలాగే ఆయన తన ఫేస్‌బుక్‌లో తను ఒక వీడియో క్రియేటర్ అని మెన్షన్ చేశారు. కానీ ఈ వీడియోలు ఫిక్షనల్ అనే విషయాన్ని ఆయన ఎక్కడా పేర్కొనలేదు. అందుచేత, దీనిపై మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఆయనకు ఒక ఈ-మెయిల్ చేశాము.
అయితే, రెండు సంవత్సరాల పాత వీడియోని, అది కూడా బ్రిటన్‌లో పిక్సీ జీవిని చిత్రించిన వీడియో అని చెప్తున్న వీడియోని, ఇప్పుడు అమెరికాలో ఏలియన్/ గ్రహాంతర వాసి అడవిలో ల్యాండ్ అయినప్పుడు చిత్రించిన వీడియో అని షేర్ చేస్తున్నారు కాబట్టి వైరల్ క్లెయిమ్ తప్పు.
మొత్తానికి, వివిధ భారతీయ రాష్ట్రాల్లో UFOలు కనబడ్డాయని సంబంధం లేని/AI- రూపొందించిన వీడియోలు తప్పుగా షేర్ చేస్తున్నారు.