Fake News, Telugu
 

23 లక్షల లబ్ధిదారులలో కేవలం ఐదుగురు కార్మికులకు మాత్రమే యోగి ఆదిత్యనాథ్ ఇలా సింబాలిక్ చెక్ అందజేసారు

0

1000 రూపాయల చెక్ అందచేయడానికి 1200 రూపాయల ఖర్చు చేసి ఫ్లెక్సీ ప్రింట్ చేయించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1000 రూపాయల చెక్ అందచేయడానికి 1200 రూపాయల ఖర్చు చేసి ఫ్లెక్సీ ప్రింట్ చేయించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటో డిసాస్టర్ రిలీఫ్ అసిస్టెన్స్ స్కీం (విపత్తు సహాయ పథకం) యొక్క ప్రారంభ కార్యక్రమం లో తీసినది. ఈ పథకం కింద 23 లక్షల మంది నిర్మాణ కార్మికుల ఖాతాల్లో మొత్తం 230 కోట్లు ఆన్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేసారు. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదుగురు కార్మికులకు 1000 రూపాయల సింబాలిక్ చెక్ అందజేసారు, పథకం కింద లబ్ది పొందిన 23 లక్షల మందికీ ఇలా చెక్ ఇవ్వలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్ లోని ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క అధికారిక ట్విట్టర్ హేండిల్ లో అటువంటి ఫోటో ఒకటి లభించింది. 09 జూన్ 2021 న పబ్లిష్ చేసిన ట్విట్టర్ పోస్ట్ లో డిసాస్టర్ రిలీఫ్ అసిస్టెన్స్ స్కీం (విపత్తు సహాయ పథకం) కింద 23 లక్షల మంది నిర్మాణ కార్మికుల ఖాతాల్లో మొత్తం 230 కోట్లు ఆన్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది.

విపత్తు సహాయ పథకానికి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ వెతికినప్పుడు, సిటీ దర్పన్ వారి ఆర్టికల్ లభించింది. ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సజన్ రావత్, మున్న లాల్, మొహమ్మద్ శరిక్, రామ్ జీవన్, లోకేంద్ర నారాయణ్ అనే కార్మికులకు 1000 రూపాయలు సింబాలిక్ చెక్ ఇచ్చినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరో న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు. ఆ సింబాలిక్ చెక్ ల యొక్క ప్రింటింగ్ కి అయిన ఖర్చు వివరాలు న్యూస్ ఆర్టికల్స్ లో ఎక్కడా లభించలేదు.

పోస్ట్ లోని ఫొటోలో 1000 రూపాయల చెక్ అందచేయడానికి 1200 రూపాయల ఖర్చు చేసినట్టు చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈ సింబాలిక్ చెక్ డిసాస్టర్ రిలీఫ్ అసిస్టెన్స్ స్కీం కింద లబ్ది పొందిన 23 లక్షల మంది నిర్మాణ కార్మికులకీ అందచేయలేదు, ఈ స్కీం ప్రారంభోత్సవ సందర్బంగా కేవలం ఐదుగురు కార్మికులకు మాత్రమే ఇలా అందజేసారు. మిగతా అందరికీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసారు. పోస్ట్ లోని పోలిక తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

చివరగా, 23 లక్షల లబ్ధిదారులలో కేవలం ఐదుగురు కార్మికులకు మాత్రమే యోగి ఆదిత్యనాథ్ ఇలా సింబాలిక్ చెక్ అందజేసారు.

Share.

About Author

Comments are closed.

scroll