Fake News, Telugu
 

వీడియోలో తనను తాను కాల్చుకున్న వ్యక్తి మంగోలియా బొగ్గు గనుల యూనియన్ నాయకుడు, మంగోలియా మంత్రి కాదు

0

మంగోలియాలో ఆ దేశ గృహ నిర్మాణ శాఖ మంత్రి తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినందుకు మీడియా ముందు తనకు తాను నిప్పంటించుకున్నాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సంవత్సరంలోపు లక్ష ఇళ్ళు నిర్మిస్తానని వాగ్దానం చేసి, కేవలం 70,000 ఇళ్ళు మాత్రమే నిర్మించడంతో ఇలా నిప్పంటించుకున్నాడని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మంగోలియా దేశ గృహ నిర్మాణ శాఖ మంత్రి తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినందుకు తనకు తాను నిప్పంటించుకున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో నిప్పంటించుకుంటున్నది మంగోలియా సాలిడారిటీ లేబర్ యూనియన్ బోర్డ్ ఛైర్మన్ ఎస్. ఎర్డెన్, ఆ దేశ మంత్రి కాదు. మంగోలియా బొగ్గు మైనింగ్‌ను చైనా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ తాను మీడియా ముందే ఇలా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన 2015లో జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న ఈ వీడియో మంగోలియాకు సంబంధించిందే అయినా, వీడియోలో నిప్పంటించుకుంటున్నది ఆ దేశ మంత్రి కాదు. వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ దృశ్యాలను నవంబర్ 2015లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు లభించాయి.

ఈ కథనాల ప్రకారం వీడియోలో నిప్పంటించుకుంటున్నది మంగోలియన్ సాలిడారిటీ లేబర్ యూనియన్ బోర్డ్ ఛైర్మన్ ఎస్. ఎర్డెన్. మంగోలియా బొగ్గు మైనింగ్‌ను చైనా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ తాను ఇలా మీడియా ముందే ఇలా నిప్పంటించుకున్నాడు.

ఇదే కారణాన్ని ధృవీకరిస్తూ 2015లో ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇదిలా ఉంటే మంగోలియాలో తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినందుకు మంత్రి తనని తాను కాల్చుకునే ప్రయత్నం చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలైతే లేవు.

చివరగా, వీడియోలో తనను తాను కాల్చుకున్న వ్యక్తి మంగోలియా బొగ్గు గనుల యూనియన్ నాయకుడు, మంగోలియా మంత్రి కాదు

Share.

About Author

Comments are closed.

scroll