Fake News, Telugu
 

పతంజలి వారి కరోనా ఔషదం కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి ఇవ్వలేదు.

0

పతంజలి సంస్థ వారి కరోనా ఔషదం కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి ఇచ్చింది అని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పతంజలి వారి కరోనా ఔషదం కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి ఇచ్చింది.

ఫాక్ట్: పతంజలి వారి కరోనా ఔషదం కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వలేదు. WHO-GMP మార్గదర్శకాల కింద కరోనిల్‌కు ఇవ్వబడిన CoPP సర్టిఫికెట్ ను భారత ప్రభుత్వ DCGI ద్వారా జారీ చేయబడిందని పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలక్రిష్ణ వివరణ ఇచ్చారు. కోవిడ్-19 యొక్క చికిత్స కోసం ఎటువంటి సాంప్రదాయ ఔషధం యొక్క ప్రభావాన్ని సమీక్షించలేదు మరియు ధృవీకరించలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఈ విషయం పై పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలక్రిష్ణ వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ‘WHO-GMP (Good Manufacturing Practices) మార్గదర్శకాల కింద కరోనిల్‌కు ఇవ్వబడిన CoPP (Certificate of Pharmaceutical Product) సర్టిఫికెట్ ను భారత ప్రభుత్వ DCGI (Drugs Controller General of India) ద్వారా జారీ చేయబడిందని స్పష్టం చేయాలనుకుంటున్నాము. WHO మందులను ఆమోదించదు లేదా నిరాకరించదు,’ అని ఆచార్య బాలక్రిష్ణ ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు.

కోవిడ్-19 యొక్క చికిత్స కోసం ఎటువంటి సాంప్రదాయ ఔషధం యొక్క ప్రభావాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్షించలేదు మరియు ధృవీకరించలేదు అని ‘WHO South-East Asia’ వారు కూడా 19 ఫిబ్రవరి 2021 న ట్వీట్ చేసారు.

‘Certificate of Pharmaceutical Product (CoPP)’ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేయదని వారు 2010 లో ప్రచురించిన డాక్యుమెంట్ లో చదవొచ్చు. 

WHO–GMP కి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, పతంజలి వారి కరోనా ఔషదం కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి ఇవ్వలేదు. WHO-GMP మార్గదర్శకాల కింద కరోనిల్‌కు ఇవ్వబడిన CoPP సర్టిఫికెట్ ను భారత ప్రభుత్వ DCGI ద్వారా జారీ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll