Fake News, Telugu
 

కోవిడ్ ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు మోదీ తెలిపిన సంఘీభావానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాత్రమే WHO చీఫ్ టేడ్రోస్ ట్వీట్ చేసాడు

0

కోవిడ్-19 లాంటి క్లిష్ట పరిస్థితుల్లో 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసింది. అక్కడి నాయకత్వంలో ఉన్న సేవా భావం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని WHO చీఫ్ టేడ్రోస్ ప్రశంసించినట్టుగా చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్-19 లాంటి క్లిష్ట పరిస్థితుల్లో 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసింది. అక్కడి నాయకత్వంలో ఉన్న సేవా భావం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని WHO చీఫ్ టేడ్రోస్ ప్రశంసించాడు.

ఫాక్ట్(నిజం): కోవిడ్ ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు మోదీ తెలిపిన సంఘీభావానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాత్రమే WHO చీఫ్ టేడ్రోస్ ట్వీట్ చేసాడు, అంతేకాని 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసిందని ప్రశంసించలేదు. ప్రశంసించినట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో ఉన్న విషయం గురించి గూగుల్ లో వెతకగా WHO చీఫ్ టేడ్రోస్ మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఒకటి మాకు కనిపించింది. ఐతే ఈ ట్వీట్ లో ఇటీవలే జరిగిన UN జనరల్ అసెంబ్లీ కి సంబంధించి విడుదల చేసిన మోదీ ప్రసంగించిన వీడియోలో ‘కోవిడ్ సంక్షోభం ఎదుర్కోవడంలో ప్రపంచంలోని ఎక్కువ ఔషధాలు ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటైన భారత దేశం యొక్క ఔషధాల ఉత్పత్తి మరియు పంపిణీ సామర్థ్యం ఉపయోగించబడుతుందని ప్రపంచానికి హామీ ఇస్తున్నాను’ అన్న మాటలను ప్రచురించిన వార్తా కథనాన్ని షేర్ చేస్తూ కోవిడ్ ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు మోదీ తెలిపిన సంఘీభావానికి కృతజ్ఞతలు తెలిపాడు అంతే తప్ప టేడ్రోస్ ఎక్కడ కూడా భారత దేశం 150 దేశాలకు మందులు సరఫరా చేసిందని ప్రశంసించలేదు. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, WHO చీఫ్ టేడ్రోస్ ఎక్కడ కూడా భారత దేశం 150 దేశాలకు మందులు సరఫరా చేసిందని ప్రశంసించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll