‘విశాఖ డ్రగ్స్ కేసులో నారా లోకేష్!’ అనే హెడ్లైన్‌తో Way2News ఒక వార్తను ప్రచురించినట్టు ఉన్న ఒక క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కేసుతో లోకేష్‌కు సంబంధం ఉందని CBI జరిపిన దర్యాప్తులో తేలినట్టు ఈ కథనంలో రిపోర్ట్ చేసారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘విశాఖ డ్రగ్స్ కేసులో నారా లోకేష్!’ – Way2News కథనం
ఫాక్ట్(నిజం): Way2News ఈ వార్తను ప్రచురించలేదని స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న క్లిప్‌లోని లింక్ అడ్రస్‌తో వెతికితే అది యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి సంబంధించిన వార్తకు సంబంధించిందని తెలుస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల బ్రెజిల్ నుండి ఇన్ యాక్టివ్ ఈస్ట్‌తో కలిపిన డ్రగ్స్‌ను CBI పట్టుకుందని వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈ నేపథ్యంలో నారా లోకేష్‌కు ఈ కేసుతో సంబంధం ఉందని CBI నిర్ధారించిందని Way2News పేరుతో షేర్ అవుతున్న ఈ క్లిప్ నిజం కాదు.
ఈ క్లిప్‌కు సంబంధించిన సమాచారం కోసం వెతకగా Way2News తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ క్లిప్‌ను తాము పబ్లిష్ చేయలేదని స్పష్టం చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఇది ఫేక్ క్లిప్ అని, తమ లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది.
సాధారణంగా Way2News తమ న్యూస్ క్లిప్‌లలో ఆ వార్తకు సంబంధించిన ఒక వెబ్ లింక్‌ను కూడా అందిస్తుంది. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో అందించిన లింక్ అడ్రస్‌తో వెతికితే Way2News తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి సంబంధించి ప్రచురించిన వార్త కనిపిస్తుంది.

ఈ వివరాల బట్టి Way2News ఈ క్లిప్‌ను ప్రచురించలేదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా వైజాగ్ డ్రగ్స్ కేసుతో నారా లోకేష్‌కు సంబంధం ఉందని CBI నిర్ధారించినట్టు ఎలాంటి విశ్వసనీయ కథనాలు మాకు కనిపించలేదు. కాగా ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటోను TDP నేత దామచర్ల సత్య ఆగస్ట్ 2021లో తన ఫేస్‌బుక్‌లో (ఆర్కైవ్) పోస్ట్ చేసారు.
చివరగా, విశాఖ డ్రగ్స్ కేసును నారా లోకేష్‌కు ముడిపెడుతున్న ఈ కథనాన్ని Way2News ప్రచురించలేదు