Fake News, Telugu
 

కేసీఆర్ ఫాం​​హౌస్‌లో గంజాయి పంట సాగు అని పేర్కొంటూ ‘Way2News’ కథనాన్ని ప్రచురించలేదు

0

గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి సమీపంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫాం​​హౌస్‌లోగంజాయి పంట సాగు జరుగుతుంది అని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించినట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫాం​​హౌస్‌లో గంజాయి పంట సాగు జరుగుతుంది అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. వాస్తవానికి, (way2.co/c7agdg) ఐడీకి సంబంధించిన 04 డిసెంబర్ 2024న ప్రచురితమైన కథనం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వాటర్ లీకేజీ అంశానికి సంబంధించినది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఫాం​​హౌస్‌లో గంజాయి పంట సాగు చేస్తున్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. 

ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ ఐడి  (way2.co/c7agdg) ద్వారా ‘Way2News’  వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ ఐడి కు సంబంధించిన 04 డిసెంబర్ 2024న ప్రచురించబడిన కథనం (ఆర్కైవ్డ్ లింక్) ఒకటి మాకు లభించింది.  ఈ కథనం ప్రకారం “తుఫాన్ కారణంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో లీకేజీ సమస్యలు ఎదురవుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. పురాతన కట్టడం కారణంగా గర్భాలయం వద్ద వర్షపు నీరు వెలుస్తుందని వారు వెల్లడించారు. లీకేజీల నియంత్రణ కోసం పనులు జరుగుతున్నాయని అధికారులు తెలియజేశారు” అని పేర్కొంది.

అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఈ వైరల్ న్యూస్ క్లిప్ ఫోటోను రూపొందించారు అని నిర్థారించవచ్చు.

చివరిగా, కేసీఆర్ ఫాం​​హౌస్‌లో గంజాయి పంట సాగు జరుగుతుంది అని పేర్కొంటూ ‘Way2News’ కథనాన్ని ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll