Fake News, Telugu
 

కరాచీలోని ఒక అహ్మదీయ మసీదును కొందరు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ పాకిస్తానీలు ఇనుము & ఇటుకల కోసం మసీదులను ధ్వంసం చేస్తున్నారని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు

0

“పాకిస్థాన్‌లో మసీదును కూల్చివేసి అందులోని ఇనుము, ఇటుకలను తమ ఆహారం కోసం అమ్ముకుంటున్నారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా కొంతమంది వ్యక్తులు మసీదులా కనిపిస్తున్న ఒక నిర్మాణం యొక్క మినార్లను కూల్చివేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్‌లో ఆహారం కోసం పాకిస్తానీలు మసీదులను కూల్చివేసి ఇనుము, ఇటుకలను అమ్ముతున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఫిబ్రవరి 2023లో పాకిస్తాన్‌ కరాచీలోని సద్దార్‌లో మైనారిటీ అహ్మదీయ వర్గానికి చెందిన మసీదును తెహ్రీక్-ఎ-లబ్బాయిక్‌-పాకిస్తాన్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది అనుమానిత సభ్యులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. అహ్మదీయ శాఖకు ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదని తీవ్రవాద ముస్లిం మత నాయకులు భావిస్తారు, అందుచేతనే పాకిస్తాన్‌లో వారిపై, వారి ప్రార్థన మందిరాలపై తరుచూ దాడులు జరుగుతాయి. అంతేకాకుండా, పాకిస్తాన్‌లో ప్రజలు ఇనుము, ఇటుకల కోసం  మసీదులను ధ్వంసం చేసినట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారాలు కూడా లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ఫిబ్రవరి 2023లో ప్రచురించబడిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). పాకిస్తాన్‌లోని కరాచీలోని సద్దార్‌లో మైనారిటీ అహ్మదీయ వర్గానికి చెందిన మసీదును కొంతమంది అనుమానిత తీవ్రవాద తెహ్రీక్-ఎ-లబ్బాయిక్‌-పాకిస్తాన్‌ (Tehreek-i-Labbaik Pakistan, TLP) సంస్థ సభ్యులు ధ్వంసం చేశారని ఈ వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనాలు ఏవీ కూడా మసీదులోని ఇనుము, ఇటుకల అమ్ముకోవడం కోసం అక్కడి ప్రజలు ధ్వంసం చేసినట్లు పేర్కొనలేదు.

వార్తాకథనాల ప్రకారం, ఫిబ్రవరి 2023లో పాకిస్తాన్‌లో మైనారిటీ అహ్మదీయ వర్గానికి చెందిన పలు మసీదులు గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో అవి ధ్వంసమయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం, అహ్మదీయులు (Ahmadiyya community) పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్నారు, వీరి జనాభా సుమారు 2-5 మిలియన్లు. 1974లో పాకిస్తాన్ ప్రభుత్వం అహ్మదీయలను ముస్లిమేతర సమాజంగా ప్రకటించింది, తీవ్రవాద ముస్లిం మత నాయకులు అహ్మదీయ వర్గం ఇస్లాం మతానికి సంబంధం లేదని భావిస్తారు. అందుచేతనే వారిపై, వారి ప్రార్థన మందిరాలపై తరుచూ దాడులు జరుగుతున్నాయి (ఇక్కడ).  

అలాగే గతంలో లేదా ప్రస్తుతం గానీ పాకిస్తాన్‌లో ప్రజలు ఇనుము, ఇటుకల కోసం  మసీదులను ధ్వంసం చేసినట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారాలు కూడా లేవు.

చివరగా, కరాచీలో మైనారిటీ అహ్మదీయ వర్గానికి చెందిన మసీదును కొందరు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ పాకిస్తానీలు ఇనుము, ఇటుకల కోసం మసీదులను ధ్వంసం చేస్తున్నారని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll