Fake News, Telugu
 

మయాన్మార్ దేశంలోని పచ్చ గనుల ప్రదేశాన్ని చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు జరిగిన దృశ్యంగా షేర్ చేస్తున్నారు

0

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో పోలవరం పనులు జరిగిన దృశ్యంలో ఒక భాగం అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిలో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు పరిపాలనలో పోలవరం పనులు జరిగిన ప్రదేశం ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో మయాన్మార్ దేశంలోని, కాచిన్ రాష్ట్రం, హ్పకాంత్ (Hpakant) పట్టణంలో ఉన్న పచ్చ గనులు (Jade mines) ప్రదేశాన్ని చూపిస్తుంది. ఈ ఫోటోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకి ఎటువంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో మయాన్మార్ దేశంలోని కాచిన్ రాష్ట్రం, హ్పకాంత్ పట్టణంలో ఉన్న పచ్చ గనులు (Jade mines) గల ప్రదేశం అని తెలిసింది. ఈ ఫోటో కేకే న్యూస్ అనే చైనీస్ న్యూస్ వెబ్సైటులో మయన్మార్ దేశంలోని పచ్చ గనులలోని నిజ జీవిత దృశాలు అంటూ అప్లోడ్ చేసిన ఫోటోలలో ఒకటి.

మయన్మార్ యొక్క పచ్చ పరిశ్రమ గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ పరిశ్రమ గురించి వివరిస్తూ పలు మీడియా రిపోర్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు ఆర్టికల్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి. పచ్చ పరిశ్రమ,  మయాన్మార్ దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన, వివాదాస్పద రంగాలలో ఒకటి. సంపదతో పాటు వనరుల దుర్వినియోగం, పర్యావరణ క్షీణత లాంటి సమస్యలతో ఈ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమకు చైనా నిధులు అందించే చట్టవిరుద్ధమైన కంపెనీల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తుందని, మిలిటరీ, సరిహద్దు గార్డ్లు, ఇతర అధికారులు పచ్చ వ్యాపారులతో ముడిపడి, తరచుగా వారు నియంత్రించే సరిహద్దుల ద్వారా ఈ రాళ్లను చట్టవిరుద్ధంగా తరలింపులు చేస్తారని ఈ రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

మానవ హక్కుల మండలి 2017లో మయన్మారుకు U.N. ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ను అత్యవసరంగా పంపాలని నిర్ణయించింది. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్, టాట్‌మాడావ్ అని పిలవబడే మిలిటరీ నిర్వహిస్తున్న సంస్థలపై యుఎన్ భద్రతా మండలి, సభ్య దేశాలు తక్షణమే ఆంక్షలు విధించాలని పేర్కొంది. దేశీయ, విదేశీ వ్యాపార ఒప్పందాల నుండి సైన్యం సంపాదించే ఆదాయాలు మానవ హక్కుల ఉల్లంఘనలను పెంచుతాయని మిషన్ పేర్కొంది. ఇకపోతే,

పోలవరం ప్రాజెక్ట్ సైట్ దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, మయాన్మార్ దేశంలోని పచ్చ గనుల ప్రదేశాన్ని పోలవరం ప్రాజెక్ట్ సైట్ దృశ్యంగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll