Fake News, Telugu
 

ఒక వీడియో క్రియేటర్ విజువల్స్‌ని A.I తయారు చేసిన రోబోట్ అని సోషల్ మీడియాలోతప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక A.I తయారు చేసిన రోబోట్ (నామి) అని చెప్తూ ఒక ఫ్యాషనబుల్ అమ్మాయి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక A.I ద్వారా తయారు చేయబడిన నామి అనే రోబోట్.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉన్నది రోబోట్ కాదు, qian_princess పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఒక డిజిటల్ వీడియో క్రియేటర్. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, విడియోపైన ఉన్న ఒక టిక్ టాక్ యూసర్ నేమ్ Seabin008ని గురించి ఇంటర్నెట్‌లో వెతుకగా, qian_princess అనే ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో వైరల్ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయికి చెందిన వీడియోలు (ఇక్కడ, ఇక్కడ ) దొరికాయి.

Qian_princess ఇంస్టా బయో బట్టి తను ఒక వీడియో క్రియేటర్. తన పేరుతో ఇంటర్నెట్‌లో వెతికితే, తాను రోబోట్ అని చెప్తూ ఎటువంటి వార్త కథనాలు లేదా ఆర్టికల్స్ లభించలేదు. 

అదనంగా, అసలు నామి అనే A.I తయారు చేసిన రోబోట్ నిజంగా ఉందా అని ఇంటర్నెట్‌లో వెతుకగా, దాన్ని రుజువు చేయడానికి ఎటువంటి వార్తా కథనాలు లేవు. 

చివరిగా, ఈ వీడియోలో కనిపిస్తున్నది రోబోట్ కాదు, ఒక వీడియో క్రియేటర్.

Share.

About Author

Comments are closed.

scroll