Fake News, Telugu
 

మహిళ అమ్ముతున్న కూరగాయలను ఒక పోలీసు చెల్లా చెదురుగా విసిరేస్తున్న ఈ వీడియో ఇప్పటిది కాదు, 2021 నాటిది

0

కూరగాయలు అమ్ముతున్న ఒక మహిళ పై ఒక పోలీస్ అధికారి దురుసుగా వ్యవహరిస్తూ, తాను అమ్మకానికి పెట్టిన కూరగాయలను రోడ్డుపై విసిరేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఇటీవల జరిగినది అన్నట్లు సూచిస్తున్న ఈ వీడియో వెనుక నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుందాం.

క్లెయిమ్: ఓక మహిళ అమ్ముతున్న కూరగాయలను రోడ్డుపై పారేసిన పోలీస్ ఆఫీసర్ వీడియో, ఈ  సంఘటన ఇటీవల జరిగినది.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని సంఘటన నాగ్‌పూర్ యొక్క జరిపట్కాలో 2021లో జరిగింది. వీడియోలో ఉన్న పోలిస్ అధికారి పేరు సంతోష్ కాండేకర్. కోవిడ్ ఆంక్షలను పాటించాలని నాగ్‌పూర్లోని మంగల్వారి మార్కెట్లో ఉన్న విక్రయదారులను ఖాళీ చేయించే క్రమంలో సంతోష్ ఒక మహిళా విక్రేత కూరగాయలను రోడ్డుపై విసిరేసాడు. కావున పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

వీడియో వివరాలను తెలుసుకోవాటానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా పోస్టులో ఉన్న వీడియో మరియు కొన్ని స్క్రీన్‌షాట్స్ కలిగిన వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఇవి మే 2021 నాటివి.

టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం 2021లో కోవిడ్ ఆంక్షలు ఉన్న సమయంలో, నాగ్‌పూర్ యొక్క మంగల్వారి మార్కెట్లో ప్యాట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న SI సంతోష్ కాండేకర్ మార్కెట్లో ఉన్న దుకాణాలను మూయిస్తున్నాడు. అప్పుడు ఒక మహిళా విక్రేత ఇంకా కూరగాయలు అమ్మడం చూసి, వైరల్ వీడియోలో కన్పిస్తున్నట్లుగా కోపంతో కూరగాయలను రోడ్డుపై పడేసాడు. కాండేకర్ ప్రవర్తనపై క్రమశిక్షణా చెర్యలు నాగ్‌పూర్ సిటీ పోలీస్ చీఫ్ అమితేష్ కుమార్ చేపట్టినట్లు టైమ్స్ అఫ్ ఇండియా కథనంలో పేర్కొన్నది.

చివరిగా, ఒక మహిళ అమ్ముతున్న కూరగాయలను చెల్లా చెదురుగా పడేసిన పోలీసు వీడియో ఇప్పుడిది కాదు, 2021 నాటిది.

Share.

About Author

Comments are closed.

scroll