Fake News, Telugu
 

భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భార్య బిడ్డతో సహా నీటిలో దూకిన దృశ్యాలంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు

0

“ఒక్క క్షణంలోనే ఏం జరుగుతుందో చూడండి భార్య భర్తల గొడవలు ఇంటి లోపల ఉండాలి బయటికి తెచ్చుకోకూడదు చూశారా పరిస్థితి చేజారిపోతుంది” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, వంతెనపై ఒక పురుషుడు, మహిళ గొడవ పడడం, తర్వాత ఆ మహిళ ఒక అబ్బాయితో పాటు నీటిలోకి దూకడాన్ని మనం చూడవచ్చు. ఈ వైరల్ వీడియో ఒక నిజమైన సంఘటనను చూపిస్తున్నట్లు పలువురు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భార్యాభర్తల మధ్య గొడవ జరిగి, భార్య బిడ్డతో సహా నీటిలో దూకిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను ‘ప్రభాత్ కుమార్ (Prabhat kumar)’ అనే కంటెంట్ క్రియేటర్ తన యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్‌లో 14 ఆగస్టు 2025న షేర్ చేశాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను 14 ఆగస్టు 2025న ఫేస్‌బుక్‌లో ‘ప్రభాత్ కుమార్ (Prabhat Kp)’ అనే యూజర్ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. అలాగే ఇదే వీడియోను (ఆర్కైవ్డ్) ప్రభాత్ కుమార్ తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా 14 ఆగస్టు 2025న షేర్ చేసినట్లు మేము గుర్తించాము.

ప్రభాత్ కుమార్ యొక్క ఫేస్‌బుక్‌ పేజీని, యూట్యూబ్ ఛానెల్‌ని పరిశీలించినప్పుడు, వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఇలాంటి పలు ఇతర వీడియోలలో (నీటిలోకి  దూకుతున్న (jump) వీడియోలు) కూడా ఉండటం మనం గమనించవచ్చు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). 

ప్రభాత్ కుమార్ తన ఫేస్‌బుక్‌ పేజీ వివరణలో, యూట్యూబ్ ఛానల్ వివరణలో అతనొక కంటెంట్ క్రియేటర్ అని, అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో వాటర్ రియాక్షన్ వీడియోలు, అడ్వెంచర్ వీడియోలు, కామెడీ వీడియోలు వంటి కంటెంట్‌ను రూపొందించి అప్‌లోడ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో స్క్రిప్టెడ్ చేయబడిందని, నిజమైన సంఘటనను చూపించడం లేదని మనం నిర్ధారించవచ్చు.

ఇంతకముందు కూడా ఇలాంటి పలు స్క్రిప్టెడ్ వీడియోలు నిజమైన ఘటనలుగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిని ఫాక్ట్–చెక్ చేస్తూ Factly రాసిన కథనాలను ఇక్కడ,  ఇక్కడఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగి, భార్య బిడ్డతో సహా నీటిలో దూకిన దృశ్యాలంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll