Fake News, Telugu
 

రూ 500 నుండి 5000 గూగుల్ పే స్క్రాచ్ కార్డును పొందండి అంటూ ప్రచారం అవుతున్న వార్త ఫేక్

1

‘FACTLY’ వాట్సాప్ నెంబర్ కి ఒక వ్యక్తి మెసేజ్ ని పంపించించి, దానిని పరిశీలించాల్సిందిగా కోరారు. ఆ మెసేజ్ లో ‘గూగుల్ పే వినియోగదారులకు ఇది శుభవార్త. స్క్రాచ్ కార్డును రూ 500 నుండి 5000 వరకు పొందండి’ అని ఉంది మరియు దాని క్రింద ఒక లింక్ కూడా ఉంది. ఆ మెసేజ్ సోషల్ మీడియా లో విస్తారంగా చలామణి అవుతోంది. అందులో ఉన్నది ఎంతవరకు వాస్తవమో తెలుసుకుందాం.

క్లెయిమ్: వాట్సాప్ లో ‘గూగుల్ పే’ పేరుతో వస్తున్న లింక్ (http://bit.ly/free-scratch-card) లోని స్క్రాచ్ కార్డు ద్వారా డబ్బులు పొందవచ్చు.

ఫాక్ట్ (నిజం): ‘గూగుల్ పే’ పేరుతో వస్తున్న ఆ లింక్ ద్వారా డబ్బులు రావు. ఆ లింక్ ని క్లిక్ చేసినచో వినియోగదారుడి మొబైల్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం (ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్వర్డ్, పిన్ నెంబర్, సోషల్ మీడియా వివరాలు) అవతలివారికి చేరిపోయే ప్రమాదం ఉంది. కావున, ఆ మెసేజ్ లో ఉన్న లింక్ నకిలీది.

వాట్సాప్ మెసేజ్ లో ఉన్న లింక్ (http://bit.ly/free-scratch-card) ని తెరిచినప్పుడు, ‘https://scratchandwin444.blogspot.com/’ అని వచ్చింది. సాధారణంగా ‘గూగుల్ పే’ వారి లింక్స్ ‘https://pay.google.com/’ తో మొదలవుతాయి. ‘గూగుల్ పే’ పేరుతో ఆ మెసేజ్ లో ఉన్న లింక్ సందేహాస్పదం అనిపించడంతో, దాని గురించి సమాచారం వెతికినప్పుడు, ఫేస్బుక్ లో ఒక పోస్టు లభించింది. అందులో, ఆ మెసేజ్ లో ఉన్న లింక్ క్లిక్ చేసినచో వినియోగదారుడి మొబైల్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం గల్లంతయ్యే అవకాశం ఉందని తెలుపుతూ, ‘Andhra Jyothi’ వారి న్యూస్ క్లిప్ ని జతపరిచారు. ఆ కథానం ‘Andhra Jyothi’ వార్తా పత్రిక యొక్క ఈ-పేపర్ వెర్షన్ లో లభించింది. దాంట్లో ‘గూగుల్ పే’ పేరుతో వాట్సాప్ లో వస్తున్న లింక్ తెరవడం వల్ల కొంతమంది మొబైల్ వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల్లో నుండి డబ్బు కోల్పోయినట్లుగా ఉంది. ఆ కథనంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ కు మెసేజ్, వాట్సాప్ రూపంలో వస్తున్న గూగుల్ లింక్ లను ఓపెన్ చెయ్యొద్దని, దాన్ని ఓపెన్ చేసినచో మొబైల్ లోని పూర్తి సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపినట్లుగా ఉంది.

‘న్యూస్18’ వారు అలాంటి లింక్ లను తెరిచినచో జరిగే ప్రక్రియ గురించి తెలుపుతూ రాసిన  కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ‘గూగుల్ పే వినియోగదారులకు ఇది శుభవార్త.. స్క్రాచ్ కార్డును రూ 500 నుండి 5000 వరకు పొందండి’ అంటూ సోషల్ మీడియాలో చలామణి అవుతున్న లింక్ నకిలీది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll