Fake News, Telugu
 

ఫోటోలో బురదతో ఉన్న ఈ రోడ్డు ఢిల్లీ కి చెందినది; బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ లోనిది కాదు

0

మొత్తం బురదతో చాలా దయనీయ పరిస్థితితో ఉన్న ఒక రోడ్డు ఫోటోని పెట్టి, ‘ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన లండన్ ఇదే’ అని వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్ (దావా):  ఫోటోలో మొత్తం బురదతో ఉన్న రోడ్డు బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ లోనిది.

ఫాక్ట్ (నిజం): అది ఢిల్లీ లో తీసిన పాత ఫోటో. ఆ ఫోటోకి, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ కిఎటువంటి సంబంధంలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటో ఉత్తరప్రదేశ్ కి సంబంధించిందని చెప్తూ కనీసం అక్టోబర్ 2018 నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా మంది అది ఢిల్లీ కి సంబంధించిన ఫోటో అని చెప్తూ జనవరి 2020 లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

కొన్ని కీ-వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా, అదే రోడ్డు కి సంబంధించిన 2018 లో పోస్ట్ చేసిన మరిన్ని ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. పోస్ట్ లోని ఫోటోలో ఉన్న అవే షాపులు మరియు పరిసరాలు ఆ ఫోటోల్లో కూడా ఉన్నట్టు చూడవొచ్చు. అయితే, ఆ ఫోటోలు ఢిల్లీ లోని సంగం విహార్ లో ఉన్న రతియా మార్గ్ కి సంబంధించినవని పోస్ట్ చేసిన వ్యక్తి రాసాడు. ఒక ఫోటోలో షాప్ అడ్రస్ కూడా ఢిల్లీ అని రాసి ఉంటుంది. గూగుల్ మాప్స్ లో కూడా ఆ షాపులు ఢిల్లీ లో ఉన్నట్టు చూడవొచ్చు. 

చివరగా, ఢిల్లీ లోని రోడ్డు యొక్క పాత ఫోటో పెట్టి, బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ లోని రోడ్డు అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll