క్వారంటైన్ సెంటర్ లో కొంతమంది వ్యక్తులు క్రికెట్ ఆడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ ఘటన ముంబై లో ని క్వారంటైన్ సెంటర్ లో జరిగిందని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ముంబై లోని క్వారంటైన్ సెంటర్ లో క్రికెట్ ఆడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియో లో క్రికెట్ ఆడుతున్నది ముంబై లోని క్వారంటైన్ సెంటర్ కాదు, అది బారాముల్లా (జమ్మూ & కాశ్మీర్) లోని క్వారంటైన్ సెంటర్. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టు లోని వీడియో గురించి గూగుల్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అదే వీడియో తో ఉన్న ‘Times of India’ కథనం లభించింది. ఆ కథనం లో, వీడియో లోని వారు క్రికెట్ ఆడుతున్నది బారాముల్లా(జమ్మూ & కాశ్మీర్) లోని క్వారంటైన్ సెంటర్ లో అని ఉంది. కాశ్మీర్ కి చెందిన ఒక జర్నలిస్ట్ కూడా అదే వీడియోని ట్విట్టర్ లో పెట్టి, ఆ ఘటన బారాముల్లా జిల్లా లోని క్వారంటైన్ సెంటర్ లో జరిగిందని పేర్కొన్నాడు.
ఏప్రిల్ 2020 లో బారాముల్లా లోని ఇన్ డోర్ స్టేడియంని కోవిడ్-19 క్వారంటైన్ సెంటర్ గా జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం మార్చినప్పుడు ‘Republic TV’ న్యూస్ ని ప్రసారం చేసింది. ఆ న్యూస్ వీడియో లో కూడా ఆ స్టేడియం ని చూడవచ్చు.
చివరిగా, వీడియో లోని వారు క్రికెట్ ఆడుతున్న క్వారంటైన్ సెంటర్ ముంబై లోనిది కాదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వీడియోలో బారాముల్లా (జమ్మూ కాశ్మీర్) లోని క్వారంటైన్ సెంటర్ లో క్రికెట్ ఆడుతున్నారు. - FACTLY