Fake News, Telugu
 

‘వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న దొంగ రోహింగ్యా వికలాంగుడు’ అని పెట్టిన వీడియోకీ, భారత దేశానికీ ఎటువంటి సంబంధం లేదు

0

ఫేస్బుక్ లో ఒక వీడియో ని పోస్టు చేసి, ‘మన దేశంలో అక్రమంగా చొరబడి.. వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న రోహింగ్యా గాణ్ణి లేచి నడవరా అంటే.. కాశ్మీర్లో చంపినట్టు చంపేయండి.. ఈ దేశంలో ముస్లింలకు బతికే హక్కు లేకుండా చేస్తున్నారంటూ ధంకీ ఇస్తున్న దొంగ వికలాంగుణ్ణి చూడండి.. వీళ్ళ కోసమేనా.. దేశ వ్యాప్తంగా నిరసనలు’ అని ఆ వీడియో గురించి పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియో భారత దేశంలోకి అక్రమంగా చొరబడి, వికలాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న రోహింగ్యా ముస్లింది.

ఫాక్ట్ (నిజం): వీడియో పాకిస్తాన్ దేశంలో ఒక జర్నలిస్ట్ నకిలీ బిచ్చగాళ్లను వెలికితీస్తూ 2009 లో తీసిన డాక్యూమెంటరీది. కావున, పోస్టులో వీడియోకీ, భారత దేశానికీ ఎటువంటి సంబంధం లేదు మరియు ఆరోపణ తప్పు.

యూట్యూబ్ లో ‘Fake beggar exposed’ అని వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిల్లో పోస్టులో ఉన్న వీడియో కూడా లభించింది. కానీ, దానికి సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా ఆ సెర్చ్ రిజల్ట్ ద్వారా తెలియలేదు. ఆ వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేసినప్పుడు, దానికి సంబంధించిన చాలా కీఫ్రేమ్స్ వచ్చాయి. వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, పోస్టులో ఉన్న క్లిప్ యొక్క పూర్తి వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. ఆ వీడియో ని జనవరి 25, 2009న అప్లోడ్ చేశారు మరియు దాని టైటిల్ ‘Rachyal Reports – Beggers (1)’ అని ఉంది. ‘అర్షద్ రచ్యల్’ పాకిస్తాన్ ప్రెస్ క్లబ్ UK మాజీ అధ్యక్షుడు. ఆ వీడియోలో ‘రచ్యల్’ నకిలీ బిచ్చగాళ్లను వెలికితీస్తూ కనిపిస్తాడు. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ద్వారా, దానిని పాకిస్తాన్ దేశం లో తీసినట్లుగా తెలుస్తుంది. ‘రచ్యల్ ‘పాకిస్తాన్ లోని నకిలీ బిచ్చగాళ్లను వెలికితీస్తూ తీసిన డాక్యూమెంటరీలోని మరికొన్ని వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

చివరగా, పోస్టులోని వీడియోకీ, భారత దేశానికీ ఎటువంటి సంబంధం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll