డిసెంబర్ 2024లో భారత నటుడు రాజ్ కపూర్ శతజయంతిని సినీ వర్గాలు జరుపుకున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ సందర్భంలో, రాజ్ కపూర్‌కు నివాళులర్పించడానికి ప్రధాని మోదీ రికార్డ్ చేసిన పాట అని క్లెయిమ్ చేస్తూ ఒక కవర్ సాంగ్ (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1951లో విడుదలైన అనారి చిత్రంలోని ‘కిసీ కి ముస్కురాహతోన్ పే’ అనే పాట ఇది, దీనిని మొదట గాయకుడు ముఖేష్ పాడారు. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ‘కిసీ కి ముస్కురాహతోన్ పే’ పాటకు ఒక కవర్ సాంగ్‌ను ప్రధాని మోదీ రికార్డ్ చేశారు.
ఫ్యాక్ట్(నిజం): ఇది AI ఉపయోగించి తయారు చేసిన పాట. ప్రధాని మోదీ తన అధికారిక సోషల్ మీడియా లేదా ఇతర అధికారిక ప్రభుత్వ కమ్యూనికేషన్ ఛానెల్‌లలో ఇలాంటి పాటను విడుదల చేయలేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి, మేము మొదట PM నరేంద్ర మోదీ ఈ పాటను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) పోస్ట్ చేశారా లేదా అని వెతికాము. అయితే, అక్కడ ఈ పాట గురించి మాకు ఎటువంటి ప్రస్తావన దొరకలేదు. ఈ పాటను ఆయన రికార్డు చేసినట్లు మీడియా కథనాలు లేదా అధికారిక ప్రభుత్వ సమాచారం కూడా మాకు లభించలేదు (ఇక్కడ మరియు ఇక్కడ).
వైరల్ వీడియో గురించి మరింత తెలుసుకోవడానికి, మేము ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా YouTubeలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వివిధ నిడివితో, వైరల్ పాటని పోలిన వీడియోలు దొరికాయి. ఈ పాట యొక్క చిన్న వెర్షన్‌ను కలిగి ఉన్న ఈ వీడియోలలో ఒకదానిలో, ఈ పాట ‘AI కవర్’ అని ప్రస్తావించబడింది.
అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి సృష్టించబడింది, నిజంగా మోదీ పాడిన పాట కాదు. ‘మోదీ మ్యూజిక్ ప్రొడక్షన్స్’, అనే YouTube ఛానెల్‌లో ఈ వీడియోలు ఉన్నాయి. ఈ ఛానెల్ వారు, PM నరేంద్ర మోదీ గొంతుతో ఉన్న అనేక AI కవర్ పాటలను అప్లోడ్ చేశారు

ఇంకా, ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి మేము వైరల్ ఆడియోను AI కంటెంట్ డిటెక్షన్ టూల్ అయిన ట్రూ మీడియా ద్వారా అనలైజ్ చేశాము. ట్రూ మీడియా రిపోర్టులో ఈ ఆడియో ఫైల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడింది అని తేలింది.

దీనిబట్టి వైరల్ వీడియోలో ఉన్న పాటను PM మోదీ రికార్డు చేయలేదని స్పష్టం అవుతుంది. ఇంకా, ఈ పాట గురించి వివరాలను సేకరిస్తున్న సమయంలో, రాజ్ కపూర్ శతాబ్ది వేడుకల సందర్భంగా PM మోదీ ఒక ‘X’ పోస్ట్ ద్వారా ఆయనకు నివాళులు అర్పించారని మాకు తెలిసింది (ఇక్కడ).
చివరిగా, రాజ్ కపూర్ స్మారకార్థం PM మోదీ ఒక పాట పాడారు అని AI వాడి తయారు చేసిన ఆడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.