2024 జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో కొల్హాపుర్‌లో నరేంద్ర మోదీ చేసిన రోడ్‌షోకి తరలి వచ్చిన జన సముద్రం అని క్లెయిమ్ చేస్తూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: 2024 ఎన్నికల నేపథ్యంలో కొల్హాపుర్‌లో నరేంద్ర మోదీ చేసిన రోడ్ షోలో గుమిగూడిన జనాల ఫోటో.
ఫాక్ట్: ఈ వైరల్ ఫోటోను 2008లో చైనాలో ప్రేక్షకులు ఒలింపిక్ జ్యోతికి స్వాగతం చెప్పడానికి గుమిగూడినప్పుడు తీశారు. 2024 జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇటీవల కొల్హాపుర్‌లో నరేంద్ర మోదీ రోడ్ షో చేయడం నిజమయినప్పటికీ, ఈ వైరల్ ఫోటోకు ఆ కార్యక్రమానికి ఏ సంబంధం లేదు. కావున, ఫోటోలోని క్లెయిమ్ తప్పు.
ఇటీవల కొల్హాపుర్‌లో నరేంద్ర మోదీ రోడ్ షో చేయడం నిజమయినప్పటికీ (ఇక్కడ, ఇక్కడ), వైరల్ అవుతున్న ఫోటోకు కొల్హాపూర్ లో జరిగిన కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో స్టాక్ ఫోటో రిపోసిటోరీ ‘flickr’లో 2008లోనే అప్లోడ్ అయి కనిపించింది. ఈ ఫోటో కింద ఉన్న వివరణ ప్రకారం చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో ఒలింపిక్ జ్యోతిని స్వాగతించడానికి ప్రేక్షకులు గుమిగూనప్పుడు ఈ ఫోటోను తీసారని ఉంది.
అంతేకాక, 2008లో వచ్చిన ఇతర వార్తా కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ) కూడా ఇదే ఫోటోను 2008లో ఒలింపిక్ జ్యోతిని స్యాగతించడానికి గుమిగూడిన ప్రేక్షకులు అని ప్రచురించారు. దీనిని బట్టి వైరల్ ఫోటోకు కొల్హాపుర్‌లో మోదీ చేసిన రోడ్ షోకు ఎటువంటి సంబంధం లేదని చెప్పవచ్చు. ఇదే ఫోటోను సునీతా కేజ్రీవాల్ గుజరాత్ లో చేసిన రోడ్ షోకి సంబంధించిన ఫోటో అని క్లెయిమ్ తో కూడా తప్పుగా షేర్ చేస్తున్నారు.
చివరగా, చైనాకి సంబంధించిన ఒక పాత ఫోటోను కొల్హాపుర్‌లో నరేంద్ర మోదీ రోడ్‌షోలో గుమిగూడిన జనాలు అని షేర్ చేస్తున్నారు.