Fake News, Telugu
 

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ అధికార ప్రతినిధి చేసిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న వీడియోను తప్పుడు ఆరోపణలతో షేర్ చేస్తున్నారు

0

టీడీపీ అధికార ప్రతినిధి అనూష వుండవల్లి వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: టీడీపీ అధికార ప్రతినిధి అనూష వుండవల్లి వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది.

ఫాక్ట్(నిజం): చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ అనూష వుండవల్లి చేపట్టిన పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకొని ఆమెను అరెస్ట్ చేసారు, ప్రస్తుతం వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ అధికార ప్రతినిధి అయిన అనూష వుండవల్లి ఏలూరు నుండి ద్వారకా తిరుమల వరకు పాదయాత్రను చేపట్టింది. ఐతే పోలీసులు ఆమెను పాదయాత్ర మధ్యలోనే అరెస్ట్ చేసారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో దీనికి సంబంధించిందే.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి సమాచారం కోసం అనూష వుండవల్లి సోషల్ మీడియా అకౌంట్స్‌లో వెతకగా, ఆమె ఇదే వీడియోను తను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ట్వీట్ కనిపించింది. చంద్రబాబు నాయుడు అరెప్ట్‌కు సంబంధించిన హాష్ ట్యాగ్‌లతో ఈ వీడియోలను ఆమె షేర్ చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ). అంతకుముందు పాదయాత్ర మొదలుపెట్టే ముందు మీడియాతో మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేసింది.

పాదయాత్ర చేస్తున్న అనూష వుండవల్లిను పోలీసులు అరెస్ట్ మధ్యలోనే అరెస్ట్ చేసిన ఈ దృశ్యాలను మీడియా కూడా రిపోర్ట్ చేసింది. వీటన్నిటిబట్టి ఆమె పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న వీడియోను తప్పుడు ఆరోపణలతో షేర్ చేస్తున్నారని స్పష్టమవుతుంది.

చివరగా, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ అధికార ప్రతినిధి చేసిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న వీడియోను తప్పుడు ఆరోపణలతో షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll