Fake News, Telugu
 

స్విట్జర్లాండ్ బాసెల్‌లో జరిగిన ఈ పాత ఘటనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఇలా ఉందంటూ, కొంతమంది కార్లను ధ్వంసం చేస్తున్న వీడియోను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొంతమంది కార్లను ధ్వంసం చేస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించింది; భారతదేశంతో దీనికి సంబంధంలేదు. బాసెల్ మరియు లూసెర్న్ మధ్య ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ గేమ్ తరువాత, 19 మే 2018న బాసెల్‌లో ఈ సంఘటన జరిగింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో ఒక ఆర్టికల్‌లో లభించింది. 20 మే 2018న ప్రచురించిన ఈ ఆర్టికల్, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించింది. బాసెల్ మరియు లూసెర్న్ మధ్య ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ గేమ్ తరువాత 19 మే 2018న బాసెల్‌లో ఈ హింసాత్మక ఘర్షణలు చెలరేగాయని తెలిపారు. కనీసం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని, పోలీసులు పలువురిని తనిఖీ చేసి ఇద్దరు జర్మన్లను అరెస్టు చేశారని తెలిసింది.

చివరగా, బాసెల్‌లో కొంతమంది కార్లను ధ్వంసం చేస్తున్న పాత వీడియోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll