భారీ జనంతో నిండిన ఒక వీధి యొక్క వీడియోను యూట్యూబర్ హర్ష సాయి అభిమానులు అంటూ షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భారీగా తరలివచ్చిన యూట్యూబర్ హర్ష సాయి అభిమానులతో వీధులు నిండిపోయిన వీడియో.
ఫాక్ట్: 2023లో ఫ్రెంచ్ రగ్బీ జట్టు స్టెడ్ రోచెలాయిస్, ఐర్లాండ్ జట్టు అయిన లీన్స్టర్ పై ఛాంపియన్స్ కప్‌ను గెలుచుకుంది. ఆ సందర్బంగా, ఫ్రాన్సులో ఉన్న ‘లా రోచెల్’ నగరంలో రగ్బీ ఛాంపియన్స్‌ను ప్రజలు స్వాగతిస్తున్న వీడియో ఇది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ఈ దృశ్యాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియోను ఒక వ్యక్తి టిక్ టాక్ లో పోస్ట్ చెయ్యడం గమనించాం. ఆ పోస్టులో ‘పాత ఓడరేవులో ఛాంపియన్ల రాయల్ వ్యూ! ఛాంపియన్లు వచ్చినప్పుడు లా రోషెల్ పాత ఓడరేవు యొక్క అద్భుతమైన వీక్షణ. గత రాత్రి లీన్స్టర్ రగ్బీతో జరిగిన ఛాంపియన్స్ కప్ ఫైనల్లో అసాధారణ విజయం సాధించినందుకు స్టేడ్ రోచెలాయిస్కు అభినందనలు! డబ్లిన్‌లోని అవివా స్టేడియంలో వారి ప్రదర్శన మన జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది.’ అని ఉంది.

దీన్ని ఆధారంగా తీసుకొని ఇంటర్నెట్లో వెతకగా, వార్త పత్రికలు (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు యూట్యూబ్ వీడియో ద్వారా ఇది ఫ్రాన్సులో ఉన్న లా రోచెల్ అనే నగరంలో మే 2023 లోని దృశ్యం అని తెలిసింది. ఫ్రెంచ్ రగ్బీ జట్టు, స్టెడ్ రోచెలాయిస్ ఐర్లాండ్‌కు చెందిన లీన్స్టర్ జట్టుపై రగ్బీ ఛాంపియన్స్ కప్‌ను గెలుచుకుంది. ఆ సందర్బంగా, ఓడరేవు నగరమైన లా రోచెల్లో దాదాపు సగం మంది ఛాంపియన్స్, కప్పు విజేతలను ఇంటికి ఇలా స్వాగతించారు.

చివరిగా, ఫ్రాన్స్ ప్రజలు రగ్బీ ఛాంపియన్స్‌ను స్వాగతిస్తున్న వీడియోని యూట్యూబర్ హర్ష సాయి అభిమానులంటూ షేర్ చేస్తున్నారు.