ఆసుపత్రి ముందు నిరసన చేస్తున్న నర్సుల వీడియోని చూపిస్తూ వరంగల్ లోని MGM ఆసుపత్రి పరిస్థితి ఇది, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక నర్స్ పేషెంట్స్ కి చికిత్స చేయడానికి హాస్పిటల్ లో తమకు సరిపడా పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్కులు లేవని ఇంకా హాస్పిటల్ లో కావలసినంత సిబ్బంది కూడా లేరని చెప్తుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వరంగల్ లోని MGM ఆసుపత్రి దుఃస్థితిని వివరిస్తున్న నర్స్ వీడియో.
ఫాక్ట్ (నిజం): ఆసుపత్రి ముందు నర్సులు నిరసన తెలుపుతున్న ఈ వీడియో వరంగల్ లోని MGM ఆసుపత్రికి సంబంధించినది కాదు. అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన ఘటనది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికగా, ‘ETV Andhra Pradesh’ వారి న్యూస్ వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. ఆ న్యూస్ వీడియో ద్వారా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన సదుపాయాలు లేకపోవడంతో నర్సులు మరియు వైద్య సిబ్బంది హాస్పిటల్ బయట ఆందోళన చేసినట్లుగా తెలిసింది. అదే విషయాన్ని ‘HMTV News’ ప్రసారం చేసిన న్యూస్ వీడియో ద్వారా కూడా తెలుసుకోవాచ్చు.
తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళనకి సంబంధించిన మరికొన్ని న్యూస్ రిపోర్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు ఆందోళన చేస్తున్న వీడియోని చూపిస్తూ వరంగల్ లోని MGM ఆసుపత్రి దుఃస్థితి అంటూ షేర్ చేస్తున్నారు.