Fake News, Telugu
 

LLB పరీక్షలోవిద్యార్థులు మాస్ కాపీ చేస్తున్న వీడియోని ఉత్తర ప్రదేశ్ లో UPSC పరీక్షలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఉత్తర ప్రదేశ్ లో UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలో విద్యార్థులు మాస్ కాపీ చేస్తున్నారు అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: ఉత్తర ప్రదేశ్ లో UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలో మాస్ కాపీ చేస్తున్న విద్యార్థుల వీడియో. 

ఫాక్ట్ (Fact): ఈ వీడియో UPSC సివిల్ సర్వీస్ పరీక్షలకు సంబందించినది కాదు. ఇది ఉత్తర ప్రదేశ్ లో బారాబంకి దగ్గర ఉన్న సిటీ లా కాలేజ్ లో LLB పరీక్షకి సంబంధించింది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో  సిటీ లా కాలేజ్, బారాబంకిలో మాస్ కాపీయింగ్ సంఘటన జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వివరాలతో ఇంటర్నెట్ లో వెతకగా ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) లభించాయి. 

ఈటీవీ భారత్ కథనం ప్రకారం ఉత్తర ప్రదేశ్ కి చెందిన TRC లా కాలేజ్ లో లా చదువుతున్న శివమ్ సింగ్ అనే విద్యార్ధి  ఈ వీడియో తీసినట్టు తెలిసింది. ఈ వీడియో ద్వారా సిటీ లా కాలేజ్, బారాబంకిలో జరుగుతున్న LLB పరీక్షలో విద్యార్థులు మాస్ కాపీ చేస్తున్నారని బయటపెట్టాడు. ఇంటర్నెట్ లో ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవడంతో, అవధ్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ ప్రతిభ గోయల్ ఈ సంఘటనను విచారించడానికి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. 

అధికారులు వెంటనే విచారణ జరిపి పరీక్షలో కాపీ చేసినందుకు 26 విద్యార్థులని అదుపులోకి తీసుకున్నారు, అలానే, సెకండ్ షిఫ్ట్ పరీక్షలో కాపీ చేస్తున్న 12 మంది అవధ్ కాలేజ్ విద్యార్థులను, 25 మంది TRC కాలేజీ విద్యార్థులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

చివరగా, LLB పరీక్షలోవిద్యార్థులు మాస్ కాపీ చేస్తున్న వీడియోని ఉత్తర ప్రదేశ్ లో UPSC పరీక్షలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll