Fake News, Telugu
 

కుటుంబ సభ్యులు అమ్మాయిని కొడుతున్న పాత వీడియోని అగ్రవర్ణాల వారు కొడుతున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కొందరు వ్యక్తులు ఒక అమ్మాయిని కొడుతున్న వీడియోని షేర్ చేస్తూ అగ్రవర్ణాలకు చెందిన పొలంలో మలవిసర్జన చేసినందుకు ఈ అమ్మాయిని ఇలా కొడుతున్నారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అగ్రవర్ణాలకు చెందిన పొలంలో మలవిసర్జన చేసినందుకు ఒక అమ్మాయిని కొందరు వ్యక్తులు కర్రలతో కొడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2019 మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాకి చెందిన ఒక అమ్మాయి తమ సముదాయానికి చెందిన వ్యక్తితో ఇంట్లో వారు కుదిర్చిన పెళ్ళికి నిరాకరించినందుకు తన సోదరులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆమెపై కర్రలతో దాడి చేసిన ఘటనకి సంబంధించింది. ఐతే ఆ అమ్మాయి ఒక దళిత వ్యక్తిని ప్రేమించిన కారణంగా ఈ పెళ్ళికి నిరాకరించిందని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. అగ్రవర్ణాలకు చెందిన పొలంలో మలవిసర్జన చేసినందుకు కొట్టారన్న వాదనలో నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2019లో రిపోర్ట్ చేసిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ వీడియోకి సంబంధించి NDTV ప్రసారం చేసిన కథనం ప్రకారం ఈ వీడియో మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాకి చెందిన ఒక గిరిజన అమ్మాయి తమ సముదాయానికి చెందిన వ్యక్తితో ఇంట్లో వారు కుదిర్చిన పెళ్ళికి నిరాకరించినందుకు తన సోదరులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆమెపై ఇలా కర్రలతో దాడి చేసిన ఘటనకి సంబంధించింది. ఈ కథనం ప్రకారం ఆ అమ్మాయి ఒక దళిత వ్యక్తిని ప్రేమించిన కారణంగా ఈ పెళ్ళికి నిరాకరించింది. పైగా దాడి చేసిన కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు ఫైల్ చేసి FIR కూడా రిజిస్టర్ చేసారు.

ఇదే వార్తని ETV ఆంధ్రప్రదేశ్ కూడా 2019లోనే రిపోర్ట్ చేసింది. ఈ కథనం కూడా పైన తెలిపిన విషయాన్నే ద్రువీకరిస్తుంది. దీన్నిబట్టి ఈ అమ్మాయిని అగ్రవర్ణాలకు చెందిన పొలంలో మలవిసర్జన చేసినందుకు కొట్టారన్న వాదన తప్పని స్పష్టమవుతుంది.

చివరగా, 2019లో మధ్యప్రదేశ్ లో ఒక అమ్మాయిపై తన కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేసిన వీడియోని అగ్రవర్ణాల వారు కొడుతున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll