Fake News, Telugu
 

ప్రధానమంత్రి మోదీ మొత్తం దేశాన్ని అమ్మేస్తున్నాడని అంటూ మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ట్వీట్ చేయలేదు

0

‘మోడీ ఎప్పుడైనా చాయ్ అమ్మాడో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు మొత్తం దేశాన్ని అమ్ముతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను’ అని మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ 2016 నవంబర్ 19 రోజున ట్వీట్ చేసాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధానమంత్రి మోదీ మొత్తం దేశాన్ని అమ్ముతున్నాడని మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ ట్వీట్ చేసాడు.

ఫాక్ట్ (నిజం): మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ కి ట్విట్టర్ ఎకౌంటు లేదు. ఇదే విషయం ఆయన 2018లో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసారు. పైగా ట్విట్టర్ కాకుండా వేరే ఇతర మాధ్యమాల ద్వారా గానీ, లేదా మీడియా తో మాట్లాడుతూ గానీ అతను మోదీ గురించి ఇలా వ్యాఖ్యానించాడని చెప్పే వార్తా కథనాలు గాని లేక ఇతర సమాచారం గానీ ఏదీ లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

నిజానికి మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ కి ట్విట్టర్ ఎకౌంటు లేదు. 2018లో ఒకసారి మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయం ఆయన స్పష్టం చేసాడు.

పైగా ట్విట్టర్ కాకుండా వేరే ఇతర మాధ్యమాల ద్వారా గానీ లేదా మీడియాతో మాట్లాడుతూ గానీ అతను మోదీ గురించి ఇలా వ్యాఖ్యానించి ఉంటే మీడియా ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేది, కాని రఘురామ్ రాజన్ మోదీని ఉద్దేశించి ఇలా అన్నటు చెప్పే ఎటువంటి వార్తా కథనాలు గానీ లేక ఇతర సమాచారం గాని మాకు లభించలేదు. దీన్ని బట్టి పోస్టులో చెప్పినట్టు మోదీ మొత్తం దేశాన్ని అమ్మేస్తున్నాడని  అంటూ రఘురామ్ రాజన్ ట్వీట్ చేయలేదని, అనలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా వాటిని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

చివరగా, ప్రధానమంత్రి మోదీ మొత్తం దేశాన్ని అమ్మేస్తున్నాడని అంటూ మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ ట్వీట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll